ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 160 కోట్ల మంది ముస్లింలు “చాంద్రమాన కేలండర్”ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రమజాన్”, రమదన్ (అరబ్బీ) అనే పదం అరబ్బీ పదము రమీద లేదా ఆర్-రమద్ నుంచి ఆవిర్భవించింది.
రంజాన్ మాసమును ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం “దివ్య ఖురాన్” గ్రంథం ఈ మాసంలో అవిర్భవిం చడమే! ఇది ఎంతో శుభప్రదమైన నెల. రంజాన్మసం సత్కార్యాల పుణ్య మాసం అనగా బరకత్ మాసము. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే “రమజాన్ మాసం. రంజాన్ మాసంలో పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు హృద యాలు పవిత్ర భావనతో నిండిపోతాయి.
“రమజాన్ మాసం నరక జ్వాలల నుండి మానవునకు విముక్తి కలిగించే విశిష్టత కలిగిన మాసం!” తిర్మిజి.
రంజాన్ నెల అంతా స్వర్గ ద్వారాలు తెరవబడి, నరక ద్వారాలు మూయబడి ఉంటాయి మరియు దుష్ట శక్తులకు సంకెళ్ళు పడతాయని ప్రవక్త (స) పేర్కొన్నారు. (సహీ బుఖారి.)
ఈ నెలలో అల్లాహ్ తన దాసులు ఆరాధనలకు, సత్కర్యాలకు ఎన్నో రెట్ల ప్రతిఫలం ఇస్తాడు. పవిత్ర రంజాన్ నెల అంతా భక్తిశ్రద్ధలతో దైవారాధనలో గడపాలి. మానవులను ప్రలోభపరిచే దుష్ట శక్తులకు ఈ నెలలో సంకెళ్లు పడతాయి. పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభీతికి, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్ నెల ఆలవాలం అవుతుంది. ఈ నెలలో ముస్లింలు దురలవాట్లకు, చెడుకు దూరంగా వుండి, హుందాగా జీవించడం చేస్తారు. ప్రార్ధనలు, ఖుర్ఆన్ పారాయ ణంతో ఈ నెల అంతా గడుపుతారు. ఇదే స్ఫూర్తితో మిగతా నెలలను కొనసాగిస్తారు.
ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం “ఉ పవాసవ్రతం”. ఈ ఉపవాసంను పార్సీ భాషలో “రోజా” అని అంటారు. అరబ్బీ భాషలో ‘సౌమ్’ అని పిలుస్తారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను పూర్తి నెలడ రోజుల పాటు పాటించడం అనేది వయో జనులైన స్త్రీపురుషులందరికీ విధిగా నిర్ణయించబడింది. ఉపవాసదీక్ష పాటిం చేవారు అబద్ధం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతోపాటూ, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ నెలంతా దైవచింత నతో గడుపుతూ వుంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణా లను పెంపొందింపజేయటమే. దీనిని ఖురాన్ “తఖ్వా”అని అంటుంది. “రోజా”ను నియమనిష్టలతో కూడుకున్న జీవన విధానంగా వివరించవచ్చును.
సాధారణంగా ముస్లింలు ప్రతిరోజూ ఐదుసార్లు నమాజు చేయడం అందరికీ తెలిసిందే! వీటికి తోడు రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనలు (తారావీహ్) జరుపు తారు. ఈ నెల తరావీహ్ నమాజ్ పాటిం చాలని ఆదేశించబడినది. ఈ నెలలో సాయంత్ర వేళలో (ఇషా) ఫర్జ్ నమాజ్ తర్వాత “తరావీహ్” సమాజ్ చేస్తారు. ఇది నెలంతా నిర్వహిస్తారు.
రంజాన్ నెలలో పిత్రా దానాలు ఇవ్వాలని ఆదేశించబడినది. ఫిత్రా అనే పదానికి అర్థం తనతోపాటు ఇతరులకు సంతోషాన్నివ్వడం, ఫిత్రా పేదలకు ధన రూపంలోగాని, వస్తు రూపములో గాని మరే విధంగానైనా ఇవ్వవచ్చు. పేద ప్రజలు సయితం ఈ నెలలో ఉపవాస వ్రతాలు పాటించేందుకు వీలుగా అందరికీ సరైన ఆహారం లభించాలనే ఉద్దేశ్యంతో దేవుడిపట్ల కృతజ్ఞతగా పేద లకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రా దానం వలన సర్వపాపాలు.
హరించబడి, ఎంతో పుణ్యం దక్కుతుంది. హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటి నుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు అన్ని ఫిత్రాదానం వల్ల క్రమించ బడతాయి” అని మహమ్మద్ ప్రవక్త (స) అన్నారని అబ్దుల్లా బిన్ మసూర్ తెలిపారు.
రంఖాన్ నెలలో మరొక విశేషం అత్య ధిక దానధర్మాలు చేయడం, సంపాదనా పరులైనవారు, సంపన్నులైనవారు రంజాన్ “నెలలో “జకాత్” అదరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తంను పేదలకు దానం చేయడాన్ని ‘జకాత్” అని అంటారు జకాత్ ను పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. “జకాత్”డు. రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత వుంది.
వెయ్యి రాత్రులకన్నా శ్రేష్టమైన ఒక రాత్రి లైలతుల్ ఖద్ర ఈ మాసంలోనే ఉంది. రంజాన్ నెలలోని 27వ తేదీన “షబ్-ఎ-ఖద్ర్” జరుపుకుంటారు. దివ్య ఖురాన్ ఈ రోజునే అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపు తారు. ఈ రాత్రి భక్తితో కఠోరదీక్షతో ప్రార్థనలు చేసేవారు.
“ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది” (దివ్య ఖురాన్ 97: 3)
సృష్టికర్త సాన్నిధ్యాన్ని పొందటానికి, ఆయన ప్రసన్నతను చూరగొనడానికి ఉ ద్దేశించబడిన ఏతెకాఫ్ కూడా రమజాన్ నెలలో పాటిస్తారు. “ఏతెకాఫ్” అంటే తపోనిష్ట. దీనిని పాటించేవారు దైవ ధ్యానం, ప్రార్థనలు, ఖురాన్ పారాయణం చేయడంలో నిమగ్నమయి వుంటారు.
మనిషి సత్ప్రవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త(స) బోధించిన మార్గాన్ని “రంజాన్” సుగమం చేస్తుంది. కనుక ఇది నిస్సందేహంగా అపారమైన వరాలను పొందే నెల అని చెప్పవచ్చును.



