ఏ సంస్థలోనైనా ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)ది ప్రధాన పాత్ర.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో వేగంగా వస్తున్న మార్పు లకు అనుగుణంగా సీఏ నిపుణ/లకు డిమాండ్ ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పారిశ్రామికీకరణ, సేవ, ఉత్పత్తి, రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుం డడంతో సీఏ నిపుణులకూ విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న వయసులోనే సమాజంలో హెూదా, గౌరవంతోపాటు మంచి వేతనం అందుకో వచ్చు.
సీఏ కోర్సు విధానం
సీఏ కోర్సును ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇందులో కామన్ ప్రొఫిషి యెన్సీ టెస్ట్ (సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫె షనల్ కాంపిటిన్స్ కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. ఈ కోర్సు మొత్తం పూర్తి చేయడానికి ఇంటర్మీడియెట్ తర్వాత కనీసం 4 ఏళ్లు పడుతుంది. సీఏ అభ్యసించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
సీపీటీ
ఇంటర్మీడియత్ తర్వాత విద్యార్థి సీపీటీ పరీక్ష రాయాలి. ఏటా జూన్, డిసెంబర్ దేశ వ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో అకౌంట్స్ 60 మార్కులకు, మర్కంటైల్ లా 40 మార్కు లకు, ఎనకనమిక్స్ 50 మార్కులకు, మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ కలిపి 50 మార్కు లకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో కనీసం 30 శాతం మార్కులు సాధిస్తూ నాలుగు సబ్జెక్టులు కలిపి కనీసం 50 శాతం మార్కులు అంటే 100కి పైగా మార్కులు సాధించాలి. సీపీటీ పూర్తి చేసిన విద్యార్థులు 9 నెలల తర్వాత ఐపీసీసీ పరీక్ష రాయాలి. డిగ్రీ, పీజీ అర్హతతో సీపీటీ రాయకుండానే నేరుగా ఐపీసీసీలో ప్రవేశించవచ్చు.
ఐపీసీసీ
ఏటా మే, నవంబర్‌లో ఐపీసీసీ పరీక్షలు నిర్వహిస్తారు ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. గ్రూప్ లో అకౌంట్స్ 100 మార్కులు, లా, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ 100 మార్కులు, ఇన్కమ్ టాక్స్, సర్వీస్ టాక్స్, వ్యాట్ 100 మార్కులు, కాస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్-2లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ 100 మార్కులు, ఆడిటింగ్ 100 మార్కులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్ట్రాటజిక్ మేనేజ్ మెంట్ 100 మార్కులకు పరీక్ష జరుగు తుంది. ప్రతి గ్రూపులో ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించాలి. అలాగే గ్రూపు మొత్తం మీద 50 శాతం మార్కులు అంటే కనీసం 150 మార్కులు సాధించాలి. అభ్యర్థులు తమ వీలును బట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు. తర్వాత ఓరియంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులోనూ ఉత్తీర్ణత సాధించాలి.
ఆర్టికల్ షిప్ తో స్టెఫండ్
ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 లేదా 2 గ్రూప్స్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ వద్ద మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తి చేయాలి. ఈ సమయంలో విద్యార్థులకు ప్రతి నెల స్టయిఫండ్ లభిస్తుంది. ఆర్టికల్‌షిప్ పూర్తవడానికి ఆరు నెలల ముందు సీఏ ఫైనల్ పరీక్ష రాయాలి.
ఫైనల్
సీఏ ఫైనల్ కూడా గ్రూప్-1, గ్రూప్-2లుగా ఉంటుంది. ప్రతి ఏటా మే, నవంబర్‌లో సీఏ ఫైనల్ పరీక్షలు జరుగుతాయి. గ్రూప్-1లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ 100 మార్కులకు, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 100 మార్కులకు, అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ 100 మార్కులకు, కార్పోరేట్ అండ్ ఎలైడ్ లాస్ 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్-2లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ 100 మార్కులకు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్ 100 మార్కులకు, డైరెక్ట్ టాక్స్ 100 మార్కు లకు, ఇన్ డైరెక్ట్ టాక్స్ 100 మార్కులకు ఉంటాయి. ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సెబ్జెక్టులోనూ 40 మార్కులు, ప్రతి గ్రూప్ లేదా రెండు గ్రూపులు కలిపి 50 శాతం మార్కులు సాధించాలి.
విస్తృత అవకాశాలు
టెలికమ్యూనికేషన్స్, బ్యాకింగ్, ఇన్సూరెన్స్, సాఫ్టవేర్తోపాటు వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలతోపాటు సీఏ కోర్సు అభ్యసించిన వారికి దేశ, విదేశా ల్లోనూ అవకాశాలున్నాయి. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ప్రతిభ, అనుభవం ఆధారంగా అధిక వేతనాలు అందుకోవచ్చు.
అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్సు
సీపీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అని భావిస్తే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తి చేసి, ఏడాదిపాటు సిఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. దాంతో ప్రభుత్వ / ప్రభుత్వేతర సంస్థల్లో అకౌంటింగ్ చేరి నెలకు కనీసం రూ.30 వేలు సంపాదించవచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ2వ గ్రూపులో కూడా ఉత్తీర్ణత సాధించి చార్టర్డ్ అకౌంటెంట్ హెూదాను పొందవచ్చు.
2016 కొత్త సిలబస్ ముఖ్య మార్పులు
సీఏ కోర్సులోని ఐపీసీసీని విద్యా ర్థులు కష్టంగా భావిస్తున్నారు కాబట్టి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉ ద్దేశంతో ఐసీఏఐ 9 నెలలు ఉన్న ఐపీసీస కోర్సు కాల వ్యవధిని 12 నెల లకు పెంచింది.
సీఏ కోర్సులోని ప్రతి దశలో కమ్యూ నికేషన్ స్కిల్స్‌కు పెద్దపీట వేశారు.
విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్న ఐపీసీసీలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనే పేర్లను పూర్తిగా తొలగించారు.
పాత సిలబస్ లో సీఏ-ఐపీసీసీలోని కాస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ రెండు సబ్జెక్టుల సిలబస్ కేవలం 100 మార్కులకే కేటాయిం చడంవల్ల స్టూడెండ్స్ ఒత్తిడిని ఎదుర్కొనేవారు. కానీ కొత్త సిలబస్ ప్రకారం వీటిని 200 మార్కులకు పెంచారు. అలాగే డైరెక్ట్ టాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ రెండు సబ్జెక్టుల మార్కులను 100 నుంచి 200 మార్కులకు పెంచారు.
సీఏ ఫైనల్లో ఇంటర్నేషనల్ టాక్సే షన్ అనే సబ్జెక్టును ప్రవేశపెట్టారు. తద్వారా సీఏ పూర్తి చేసిన అభ్యర్థు లకు విదేశాల్లోనూ ఉద్యోగాలు ఎక్కువగా లభించే అవకాశం ఏర్పడు తుంది.
సీఏ కోర్సులోని మొదటి దశ సీఏ సీపీటీ ఇప్పటి వరకు కేవలం ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇకపై 50 శాతం డిస్క్రిప్టివ్, 50 శాతం ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇది విద్యా ర్థుల్లో కాన్సెప్ట్ అర్తం చేసుకుని పరీక్ష రాసే అలవాటు పెంపొందించు కుంటారు. అంతేకాకుండా డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే ఐపీసీసీ, ఫైనల్ పరీక్షలకు మరింత మెరుగ్గా సన్నద్ధం అయ్యేందుకు తోడ్పడుతుంది.
సీఏ కోర్సులోని సీపీటీ, ఐపీసీసీ దశల పేర్లను వరుసగా ఫౌండేషన్, ఇంటర్మీ డియెట్లుగా మార్చారు.
కొత్త సిలబస్ ను ఐసీఏఐ అమల్లోకి తీసుకురాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.



