విద్య అభ్యున్నతి ఉద్యమం ప్రధాన లక్ష్యం విద్యలో తెలంగాణ బంగారు తెలంగాణ. అనే శీర్షికతో జూన్ 10 నుండి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆదిలాబాద్ నుండి మహబూబ్ నగర్ వరకు విద్యార్థి సంఘాలతో, మేధావి. వర్గాలతో చర్చాగోష్టి కార్యక్రమాలు నిర్వ హించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ మలిక్ షారిక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడిని అరికట్టాలని, ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలోని పాఠశాలలో తనిఖీలు వెంటనే నిర్వహించాలన్నారు. విద్యా అధికారులు, శాసన సభ్యులు, మంత్రులకు వినతిపత్రాలను సమర్పించారు.
ప్రభుత్వ పాఠశాలల అలసత్వమే కారణం
స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యం.డి. కరీముద్దీన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు షబ్బీర్ మరియు ఇతర సభ్యులు,కర్నూలు శాసన సభ్యులు ఎస్.వి. మోహనరెడ్డిగారితో కలిసి విద్యకు • సంబంధించి పలు విషయాలు చర్చించారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మార్పు, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ప్రవేట్ సంస్థలో 25% నిరుపేదలకు కేటాయించడం మరియు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకు వచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరింత దిగజారిపోతుందని, ఇందుకు ప్రభుత్వ పాఠశాలల అలసత్వమే కారణమని అన్నారు. చాలా ప్రాంతాలలో సరైన పాఠశాల భవనాలు లేవని, కొన్ని చోట్ల వున్నా అవి మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలు కూడా లేని పాఠశాలలు ఉన్నాయని ఇందువల్లే ప్రభుత్వ పాఠశాలలో పిల్లల శాతం తగ్గుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని పాఠశాల నిర్వహణ సరైన మార్గంలో వుంటే రాబోయే కాలంలో విద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అన్నారు.



