బక్రీద్ పండుగ అంటే పశువులన ఇస్తారని చాలా మందిలో ఆలోచ వస్తుంటాయి. బక్రీద్ సందేశం కేవలం . వులను బలి ఇవ్వడం మాత్రమే కా దీని అసలైన పరమార్ధం ఏమిటంలో ఖుర్బానీ ద్వారా త్యాగగుణం, సమర్పణ. సామివ్యం, క్షమాగుణం వీటికంటే ఎక్కువగా అతనిలో బాధ్యతాభావం, జవాబుదారీతనం పెంపొందించుకోవటమే బక్రీద్ సందేశం. ముస్లింలు విశ్వసించే ఏకైక సిద్దాంతం మనిషికి ప్రసాదించబడిన జీవం, జ్ఞానం అతని సొత్తుకాదు. అది దైవం ప్రసాదించినన బహుమతిగా విశ్వసిస్తారు. ఇక్కడ లభించే వస్తుసామాగ్రీ సమస్త సంపదా అతనిది కాదు. అది దైవం ఇచ్చినవి కాబట్టి వీటిని దైవాదేశాలకు అనుగుణంగా వాటిని వినియోగించాలనే తపన అతనిలో జనించాలి.
ఖుర్బానీ గురించి తెలుసుకోవాలంటే మొదట ఇబ్రహీం (స)గారి జీవితంలో జరిగిన అపురూపమైన ఘట్టాలు, త్యాగాలను తెలుసుకోవాలి. సత్యం, న్యాయం కోసం ఆయన తన జాతివారితో విరోధం కొని తెచ్చుకొని కన్నతండ్రికి దూరమయ్యారు. దుర్మార్గుడైన చక్రవర్తి ఆగ్రహానికి గురై అగ్ని గుండంలో విసిరి వేయబడ్డారు. దైవం ఆయనను దాని నుండి కాపాడినా జాతి ప్రజలు ఆయనను బహిష్కరించారు.
జన్మభూమిని, బంధువులు, తల్లిదండ్రులను సైతం, ఆయన విడిచి పెట్టవలసి వచ్చింది. సత్య అన్వేషణలో పరదేశానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కూడా ఇబ్రాహీం (స) సుఖంగా లేరు.
నత్యాన్ని, శాంతిని, మానవత్వాన్ని స్థాపించగలననే ఆకాంక్ష, ఆయనకు కష్టాలను ఆహ్వానించింది. జీవితంలోని చివరి దశలో ఇబ్రహీం (స)కు కుమారుడు జన్మించాడు. వారి పేరు ఇస్మాయిల్ (అలైన) తండ్రి కుమారుణ్ని ఎంతగా ప్రేమించారో అలాగే కుమారుణ్ని సత్యాన్ని అహింసను ఇష్టపడేవారిగా తీర్చిదిద్దారు. అలాంటి కుమారుణ్ని తనకు సమర్పించాలని దేవుడు ఆదేశించాడు. తండ్రి కుమారులు దేవుని ఆజ్ఞను శిరశావహించి ఆదేశాన్ని తక్షణం అమలు చేయడానికి సిద్దమయ్యారు. ఆ కుమారుడు కూడా తండ్రికి తగిన తనయుడు ఏది దైవ చిత్తమో అదే చేయమన్నారు.
హజ్రత్ ఇబ్రహీం (స) జీవితం త్యాగాల ప్రయాణం. వాటిని స్మరించు కుంటూ ఆ త్యాగానికి గుర్తుగా ముస్లిమ్‌లు ప్రతి సంవత్సరం బక్రీద్ సందర్భంగా జంతువులను ఖుర్బానీ ఇస్తారు.
ఖుర్బానీ అనే పదం “ఖుర్బ్” అనే అరబీ పదం నుండి గ్రహించబడింది. ఖుర
అంటే దగ్గరవడం, కనుక ఖుర్బానీ అంటే త్యాగగుణం మనిషిలో నిత్యం ఉండాలనేది దీని ఉ దేశం తద్వారా సమాజంలో మంచిని పెంపొందించలనే తపన న్యాయ స్థాపనకు నడుంబిగించాలనే సంకల్పం మనిషిలో జనించాలి.
దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే పశువులను బలి ఇవ్వడం మాత్రమే బక్రీద్ సందేశం కాదు. “మీరు బలిఇచ్చే జంతువుల మాంసంగాని వాటి రక్తం గానీ సృష్టికర్తకు చేరవు. మీలోని భక్తీ పరాయణత, భయభక్తులు మాత్రమే చేరుతాయి”.
కాబట్టి ఖుర్బానీ అనలైన సందేశం, దేవుని దయవల్ల తనకు లభించిన వస్తువు సంపదను, సమయాన్ని, నైపుణ్యాలను ఏ క్షణమైన అయిన త్యాగానికి సిద్ధపడేలా చేసే బలమైన సంకల్పం, విశ్వాసం మనిషిలో జనించాలి. అప్పుడే సమాజం ఉన్నతమైన ఆదర్శమైన సమాజంగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి ఉత్తమమైన సమాజం కొరకు, అందరు అహర్నిశలు కృషి చేస్తూ త్యాగాలతో నమాజంలో శాంతి, న్యాయం, సహృదభావం నెలకొల్పడానికి సిద్ధం కావాలనే గొప్ప సారాంశం ఈదుల్ అజ (బక్రీద్) సందేశం.



