Friday, November 27, 2026
spot_img

జాతి నిర్మాణం యువతతోనే సాధ్యం

ఎస్ఐఓ ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంటూ, 16వ మీఖాత్ ను ఆరంభించింది. ఈ విద్యార్థి దళానికి నాయకత్వం వహిస్తున్న జాతీయ అధ్యక్షులు బ్రదర్ అష్ఫాఖ్ అహ్మద్ షరీఫ్ తో జరిగిన ఇంటర్వూలో ఆయన సంస్థ ప్రాధాన్యతలు, నేటి పరిస్థితుల్లో యువశక్తి పాత్రపై ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూ యొక్క కొన్ని ముఖ్యాంశాలు పాఠకుల దృష్టికి తెస్తూ…

 సంస్థ అధ్యక్ష బాధ్యతను మీరు ఎలా భావిస్తున్నారు?

జ: నా భుజస్కందాలపై అధ్యక్ష బాధ్యతలు రావడం. ఒక రకంగా నాపై ఇదొక పరీక్షా సమయమే! దీనిని ఆ దైవం తరుపు పరీక్షగా భావిస్తున్నాను వచ్చే రెండేళ్ళపాటు సంస్థ మరియు సంస్థ సంబంధీకుల బాధ్యతనా పై ఉ ది. మరోవైపు ఆ దైవం నాకీ బాధ్యతలనప్పగించి, ధర్మ సంస్థాపన

వంటి మహత్తర కార్యాన్నినిర్వర్తించే కృషిలో ఓ ఉన్నతస్థానం నుండి సేవ చేయ గలిగే సదవకాశం

కల్పించడం జరిగింది. ఈ మార్గంలో స్థిరచిత్తంతో సాయశక్తుల కృషి చేసే భాగ్యాన్ని ఆ దైవం కల్పించాలని వేడుకుంటున్నాను.

మీ దృష్టిలో దేశవిద్యార్థుల ముందున్న నేటి సవాళ్ళేమిటి ?

జ: నేటి విద్యార్థుల ముందు ఎన్నో సవాళ్ళున్నా యి. ప్రత్యేకించి నేటి విద్యార్థుల్లో మనోవిజ్ఞానం తగ్గుతూ కనిపిస్తుంది. నా దృష్టిలో నేటి విద్యా ర్థుల ముందున్న అత్యంత ముఖ్యమైన అంశం నమాజంలో చెడులు అన్యాయం భాగమైపో యాయి. దీనిపై దృష్టి సారించి, దీనికి వ్యతిరేకంగా గళమెత్తి సమస్య పరిష్కారానికి కావాల్సిన స్పృహ social sensitivity నేటి విద్యార్థుల్లో అంతంత మాత్రంగా ఉంది. ఇదో ఎదుర్కొనవలసిన ముఖ్య సమస్య. ఈ పతనానికి కారణం నీతి విలువలకు బదులుగా కెరియర్కే ప్రా ధాన్యత ఇచ్చే విద్యావ్యవస్థ. సామాజిక స్పృహను కోల్పోతూ విలువలు విడనాడుతున్న నేటి ఈ పరిస్థితుల్లో పనిచేయడమే ఓ పెద్ద సవాలుగా వుంది.

 

ఎస్ ఐఓ నేటికి ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంది. సంస్థ వేగం, అభివృద్ధి గురించి మీరేమంటారు?

జ: ఎస్ఐఓ యొక్క ఈ 30 సంవత్స రాల సుదీర్ఘ ప్రయాణాన్ని మీరు పరిశీలిస్తే ఇందులో ఎన్నో మార్పులు కొత్త కోణాలు కనిపిస్తాయి. ప్రారంభ దశలో సంస్థ సంబంధీకుల్లో విద్యా ర్డులు తక్కువ సంఖ్యలో ఉండేవారు కానీ నేడు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు సంస్థ సంబంధీ కులుగా ఉన్నారు. అప్పట్లో సంబధీ కుల వయోపరిమితి 35 సం||గా ఉండేది. నెమ్మదిగా యువకుల పాత్ర తగ్గుతూ 21వ దశాబ్దం ప్రారంభం నుండే సంస్థ విద్యార్థి దిశగా పయనిం చసాగింది. నేడు దైవకృపవల్ల చాలా వరకు సఫలీకృతమయ్యా ము. నేడు సంస్థ ఈ విషయాలను పరిగణిస్తూనే తన పాలసీ ప్రోగ్రాంను రూపొంది స్తుంది. దీనికి ముఖ్య కారణం మనం ఆశించే ఆ విద్య ప్రాతిపదికన, “knowledge production” పై జరిగే మహెూద్యమమే!

ఎస్ఐఓ ఈ 30 ఏళ్ళకాలంలో దేశ విద్యార్థుల్లో, యువకుల్లో నిరంతర కృషికై ఉత్సహాన్ని నింపి, ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. విద్యాలయాలలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పే కృషి చేస్తూ, విద్యను పునర్నిర్మించే నినాదాన్ని లేపింది. ఇలా ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలను చేపడుతూ వచ్చింది. అయినప్పఇకీ సంస్థ అనేక రంగాలలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

సంస్థ గత కొంత కాలంగా విద్యార్థి దిశలో పయనించడం గమని స్తున్నాము. సంస్థపై దీని ప్రభావం ఎలా ఉంది?

జ: స్టూడెంట్ ఓరియంటేషన్ అనేది నుదీర్ఘ ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. పాలసీ ప్రోగ్రాంను గమనిస్తే విద్యార్థులను దృష్టిలో ఉంచి రూపొం దించినట్లు తెలుస్తుంది. అలాగే విద్యార్థుల భావాలను, విద్యా విధా నాన్ని, క్యాంపస్ మరియు సమాజాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. స్టూడెంట్ ఓరియం టేషన్ అంటే యువకులు అందులో భాగం కాదనే అర్ధం కానే కాదు. 30 సం||లోపుగల ప్రతి ఒక్కరు సంస్థలో భాగమే. స్టూడెంట్ ఓరియంటేషన్ అనగానే మన కార్యక్రమాలన్నీ క్యాంపస్ కు సంబంధించినవే అను కోవడం తప్పు. క్యాంపస్ వర్క్ అనేది మన కార్యక్రమాలలో ఒక భాగం మాత్రమే. వాస్తవానికి ఈ సువిశాల సమాజంలో పనిచేయాలన్నది మన ఆకాంక్ష. ఇందులో విద్యాలయాల పాత్ర ను విస్మరించలేము. కాబట్టి విద్యాల యాలతో పాటు సమాజంలోనూ కార్య క్రమాలు నిర్వహించడం తప్పనిసరి. 

 మీఖాత్లో మీ విజన్ ఏమిటి ?

జ: ఈ మీఖాత్ లో సంస్థ కొత్త పథాన పయనించనుంది. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చామో మరెన్నో చేయాల్సినవి ఉన్నాయి. ఈ మీఖాత్ లో సంస్థ నమాజంలో ఓ మెయిన్ స్ట్రీమ్ ఆర్గనైజేషన్ అవ్వాలి.

అంటే నా ఉద్దేశంలో సమాజంలో విద్యార్థుల ప్రతి సమస్యకు పరిష్కారం ఎస్ఐఓతో సాధ్యమనే స్థాయిలో కృషి చేయాలి. సమాజంలో ఓ ప్రధాన సంస్థగా ముందుకు సాగే అవకాశం ఉ న్నప్పటికీ మనం పూర్తిగా సమాజంలో ప్రభావాత్మకం కాలేకపోతున్నాము. ఎస్ఐఓ విద్యార్థి గళం కావాలనేది నా ఆకాంక్ష, సిద్ధాంతపరంగా సామాజిక విప్లవం వైపుకు ముందడుగు వేయాలి నా దృష్టిలో క్యాంపస్ పనిలో సృజనా త్మకత అవసరమైనదే దీనికి తోడు క్యాడర్ లో స్పర్శజ్ఞానంతో ఏకాగ్రత అవసరం. మనం ప్రస్తుతం కంటే ముందుకు సాగి సమస్య (issues) పట్ల సామాజిక స్పృహను పెంపొందించాల్సి ఉంది. రెండవది మన దేశంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం మన దేశ యువతలోనే ఉంది. దేశ నిర్మాణానికి కావాల్సిన విద్యార్థులు, యువకులను తయారు చేయడమే నా చిరకాల స్వప్నం. ఇందుకు సుదీర్ఘ సమయం పడుతుంది.

ఇస్లామీయ సందేశం విషయంలో భారత సమాజ నేపథ్యంలో ఎలాంటి కార్యచరణ ఉంది ?

జ: మన దేశంలో ఇస్లాం ఒక సంపూర్ణ జీవన వ్యవస్థగా పరిచయం చేయడం నందేశవరంగా మన బాధ్యత ప్రత్యేకించి ఇక్కడ సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇస్లాం ప్రాథమిక విశ్వాశాలు విలువలు, సామజిక సమస్యలను సంభోదిస్తూ ఇస్లాం సందేశం అందించే కార్యచరణను సంస్థ పాఠిస్తుంది సందేశ కార్యక్రమమనగానే ఓ ప్రత్యేక విధానాన్ని అవలంభించాలనే అపోహను మానుకోవాలి. సందేశం అనేది చాలా విస్తృత పరిధిని కలిగి ఉంది. తమ వ్యక్తిత్వం ద్వారా, వృత్తి ద్వారా అన్ని విధాన సందేశ అవకాశాలను వినియోగించుకోవాలి.

విద్యార్థి లోకానికి మీరిచ్చే సందేశం ఏమిటి?

జ: విద్యార్థులు విప్లవాలకు మారుపేరు. చరిత్ర తిరగేయండి. విద్యార్థులు యువకులే మున్ముందు నాయకుల య్యారు. సంభవించిన అరబ్ ఉ ద్యమాలను గమనిస్తే ఎందరో విద్యార్థులు, యువకులు, ఇందులో భాగమయ్యారు. సంక్షిప్తంగా చెప్పాలం టే సామాజిక మార్పులో విద్యార్థుల పాత్ర ముఖ్యమైనది. నేడు మనం అనేక నమస్యలలో జీవిస్తున్నాము. ఈ సమస్యలను పరిష్కరించి, సామాజిక మార్పును తేవాలన్నదే విద్యార్థుల కలకావాలి. విద్య ద్వారా కేవలం యాంత్రిక జీవనం సాగిస్తూ సంపాదనే ధ్యేయం కాదు. వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. నేడు విద్య విలువలను విస్మరిస్తుంది. విలువాధారిత విద్య, ఉ న్నత నడవడితో పాటు సమాజం పట్ల

బాధ్యతా యుతులై నమన్యల పరిష్కారానికి సన్నద్ధమవ్వాలి.

చివరిగా సంస్థ సంబంధీకులతో…

జ: సంస్థ శ్రేణులతోనూ పైన ప్రస్తావించిన విషయాలనే తెలుపుతు న్నాను. సమాజంపట్ల వారి బాద్యతల ను గుర్తించి సంస్థ పాలసీ ప్రోగ్రాంను బాగా అధ్యాయనం చేసి దానిని ఆచ రణ రూపంలో తెచ్చేందుకు శత విధాల కృషి చేయాలి. నేటి దేశ పరిస్థితుల్లో ఓ నిజమైన ఇస్లాంను ప్రాతినిధ్యం వహించేవారుఆ, తమ వ్యక్తిత్వాన్ని నిర్మించేందుకు కృషి చేయండి. దైవ గ్రంధం మరియు ప్రవక్త (న॥) ఆదర్శాలను అలవరుచుకుంటూ సమయం, మరియు సమాజంపై దృష్టి ఉంచి సమాజ పునర్నిర్మాణంతో తమ వంతు బాధ్యతను నిర్వర్తించండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles