Friday, November 27, 2026
spot_img

లెటెస్ట్

ఓ రాజ్యంలో రాజు గారు ఓ ప్రకటన చేశారు.. రాజ్యంలో ఓ మామిడి తోట ఉన్నది ఆ తోటలో మొత్తం ఆరు భాగాలున్నాయి. అయితే వాటిలో నుండి అత్యంత శ్రేష్టమైన మామిడి కాయను తీసుకువచ్చిన వారికి బహుమానాన్ని ప్రకటించారు. షరతు ఏమిటంటే ఓ భాగం గేటు దాటిన తరువాత తిరిగి వెనుకకు రాకూడదు. చాలా మంది ప్రయత్నించారు కాని ఓడిపోయారు. ఓ వ్యక్తి సరే అని బయలుదేరాదు ముందు భాగంలో అంతా తిరిగి ఓ మామిడి కాయను చూశాడు కానీ మిగిలిన ఐదు భాగాలలో ఇంకా మంచివి ఉండవచ్చు కదా అంటూ రెండవ భాగంలోనికి వెళ్ళాడు అక్కడ అంతే అనుకున్నాడు… అలా ఇంకా మంచిది ఇంకా మంచిది అని వెతుకుతూ వెళు తూ ఐదవ భాగంలో కాయలు కొంత దెబ్బతిని ఉన్న సంగతి చూశాడు చివరి భాగంలో ఏదో ఒకటి తీసుకొని బయటపడదాం అనుకున్నాడు చివరి భాగంలో అసలు కాయలులేకపోవడంతో విషయం అర్ధమై అందరూ ఎందుకు పరీక్షలో ఓడిపోతున్నారు తెలుసుకున్నాడు.

ఎక్కువ మంది జీవితంలో ఇలాగే చేస్తుంటారు వచ్చిన దానికి తృప్తి చెందక ఇంకా ఎదో కావాలి.. ఉ న్నతమైనది కావాలి… ఇంకా మంచిది కావాలి అంటూ వెతుకుతూ వెతుకుతూ చివరకు ఏదీ సాధించకుండానె మిగిలిపోతారు. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అది కొనేవస్తువైనా సరే ఉన్నవాటిలో మంచిది తీసుకోవాలే తప్ప భవిష్యత్తులో 205 మంచిది
దొరుకుతుందనుకుంటూ ఉంటే భవిష్యత్తు ఎప్పుడూ ముందే ఉంటుంది. నేటి రేపు ఎప్పుడు ఒక రోజు దూరంగానే ఉంటుంది.

మానవుడి పుట్టుక నుండి అభివృద్ధి జరుగుతూనే ఉంది. ప్రారంభంలో కొన్ని సంవత్సరాలు.. తరువాత నెలలు.. రోజులు.. ప్రస్తుతం గంటల్లోనే అభివృద్ధి కొత్తపుతంలు తొక్కుతుంది. ఎప్పటి కప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉంది. మొబైల్ రంగంలో వస్తున్న మార్పులు దీనికి చక్కటి ఉదాహరణ. మీరు ఈ రోజు ఓ మొబైల్ ఫోన్ను చూసి రేపు కొందామనుకున్నారంటే రేపు మరో కొత్త మోడల్ మార్కెట్లో విడుదలవుతుంది. దీనికంటే మంచి ఫీచర్లు, ముందటి దానికంటే మంచి టెక్నాలజీలతో లభ్యమవుతూనే ఉంటాయి. నేటి పోటీ ప్రపంచంలో ఓ కంపెనీకి మించి మరో కంపెనీ తమ ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసే పోటీలో గంటల్లోనే కొత్తకొత్త వెరైటీలను మార్కెట్లోకి వదులుతున్నాయి. కేవలం మొబైల్లలో మాత్రమే కాదు. కార్లు, బైక్ లో కూడా ఇలాంటి పోటీ ఏర్పడింది. కాబట్టి ఏదో ఒక చోట మనం సర్దుకుపోవాలి లేదంటే కొనడం కలగానే మిగిలిపోతుంది.

కాబట్టి 100శాతం మనకి నచ్చిందో లేదా పరిపూర్ణమైన (పర్ఫెక్ట్ దొరకాలని వెతుకుతూ ఉండిపోకూడదు. ఎందుకంటే అలాంటి దొరకటం అతికష్టం ఎదో ఒకలోపం కొంచెం ఎక్కువ తక్కువ వేరేవాటితో పోల్చితే ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఉన్న వాటిలో మంచిది.. తీసుకొని వాటిలోని లోటుపాట్లను సవరించు కున్నట్లయితే ఉత్తమమైనది మనకు దొరికనట్లే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles