Friday, November 27, 2026
spot_img

ఎస్ఐఓ విద్యార్థి ప్రణాళిక

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (SIO) విద్యార్థి ప్రణాళికను విడుదల చేసింది. ఈ ప్రణాళికను ప్రధాన ఎన్నికల అంశంగా పరిగణించి ఎన్నికల అనంతరం అమలుపరచాల్సిందిగా భారతదేశంలోని విభిన్న రాజకీయ పక్షాలు, నాయకులను ఎస్ఐఓ కోరింది. ప్రణాళికను విడుదలచేస్తూ ఎస్ఐఓ అధ్యక్షులు ఇక్బాల్ హుసేన్ విలువలతో కూడిన మెరుగైన విద్యను అందించాలని, యువ కుల్లో మతతత్వాన్ని, సెక్యులర్ విలువలను దెబ్బతీసి శాంతి యుత సహజీవనానికి భంగం కలిగించే పాఠ్యాంశాలలోని అభ్యం తరకరమైన అంశాలను పునఃపరిశీలించాలని కోరారు. ముస్లింలు అన్నిరంగాలలో అభివృద్ధి సాధించాలని అన్నారు. సచార్కమిటీ నివేదికను తగినరీతిలో అమలు పరచని యూపీఏ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. కళాశాలలో విద్యార్థి సంఘాల ఎన్నిక లను నిర్వహించవలసిందిగా కోరారు.

విద్యార్థి ప్రణాళిక ముఖ్యాంశాలు

● పాఠ్యాంశాల్లో నైతిక ప్రమాణాలను, విలువలను భాగంగా చేయాలి. ఆల్కహాల్, డ్రగ్స్, అశ్లీలతను నిషేధించాలి.
● విద్యా హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలుపరచాలి. ఈ చట్టాన్ని అమలుపరచని విద్యా సంస్థలపై భారీ జరిమానాలు విధించాలి.
● ఉపాధ్యాయుల ఖాళీలను పూర్తి చేయాలి. కాంట్రాక్ట్ ఉ పాధ్యాయుల సర్వీస్లను రెగ్యులరైజ్ చేయాలి.
● బాలురు, బాలికలకు వేర్వేరుగా ప్రత్యేక విద్యావకాశాలను కల్పించాలి.
● సెక్యులర్ భావనను పెంచేవిధంగా 2005 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్్ను పునఃసమీక్షించాలి.
● విద్యా వ్యాపారీకరణను అరికట్టాలి.
● దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలలోని ఎంబిబిఎస్/ఎండీ/ ఎంఎస్ సీట్ల సంఖ్యను పెంచాలి..
● సాంకేతిక విద్యా ప్రమాణాలను, రీసెర్బిను పెంచేవిధంగా జాగ్రత్త వహించే మానిటరింగ్ వ్యవస్థను నెలకొల్పాలి.
● ఏయిమ్స్, ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్స్, హుమానిటీస్ లో ఫ్రీ ఆన్లైన్ కోర్సులను,
ఆన్లైన్ వెబ్, వీడియో కోర్సులను ప్రారంభించాలి.
● విద్యా సంస్థలలో నైపుణ్యం పెంచటానికి, ఉపాధి అవకాశాల కల్పనలో సహాయపడే శిక్షణా కేంద్రాలను ప్రారంభించాలి.
● ఢిల్లీ యూనివర్సిటీ ప్రారంభించిన నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ను పునః సమీక్షించాలి.
● చదువులో వెనుకబడిన సమాజంలోని బలహీనవర్గాల విద్యార్థులు, ఇతర వర్గాల విద్యార్థులతో సమానంగా విద్యను అభ్యసించేటట్లు అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు రెమెడియల్ కోచింగ్ను ప్రారంభించాలి.
● యూజీసీ నెట్ పరీక్షా కేంద్రాలను పెంచాలి.
● ఎంసిడి కింద వచ్చే కళాశాలలను, హాస్టళ్ళసంఖ్యను పెంచాలి.
● జిడిపిలో 6% కేటాయింపును దేశ బడ్జెట్లో విద్యా పద్దు కింద చేయాలి.
● యుపిఎస్సీ పరీక్షలలో విదేశీ భాషను ఒక ఆప్షనల్గా ఎన్నుకొనే సౌకర్యాన్ని తిరిగి కల్పించాలి..
● సచార్ కమిటీ, మిశ్రా కమిటీ నివేదికలను అమలుపరచాలి.
● ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు వడ్డీరహిత రుణాలను ఇవ్వాలి. ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ సంస్థలను, వ్యక్తులను నియంత్రించే సంస్థను ఏర్పాటు చేయాలి. సరైన విద్యా పాలసీలను, పరిశోధనలను, పాఠ్య ప్రణాళికలను
●
● పెంపొందించే జాతీయస్థాయి సంస్థలైన నేషనల్ ఇన్స్టిట్యూట్
●
● ఆఫ్ ఎడ్యుకేషన్ లాంటి సంస్థలను రూపొందించాలి.. విద్యా సంస్థలలో సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చే రిహాబిలిటేషన్ సంస్థలను నెలకొల్పాలి.
●
● విద్యార్థి సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వాలి. యువకుల కోసం టెక్నికల్, ఓకేషనల్ స్కిల్స్ అభివృద్ధి చేసే సెంటర్స్ను పెద్దఎత్తున ప్రారంభించి స్వయంగా పరిశ్రమలు స్థాపనకు సహకారం అందించాలి.
●
● అక్రమంగా నిర్భందించబడి నిర్దోషులుగా ప్రకటింపబడిన యువతకు నష్టపరిహారం అందించాలి. విద్య, ఉపాధి అవకాశాలు పొందేందుకు వారికి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
● ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ సంస్థలను, వ్యక్తులను నియంత్రించే సంస్థను ఏర్పాటు చేయాలి.
● సరైన విద్యా పాలసీలను, పరిశోధనలను, పాఠ్య ప్రణాళికలనుపెంపొందించే జాతీయస్థాయి సంస్థలైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంటి సంస్థలను రూపొందించాలి..
● విద్యా సంస్థలలో సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చే రిహాబిలిటేషన్ సంస్థలను నెలకొల్పాలి.
● విద్యార్థి సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వాలి.
● యువకుల కోసం టెక్నికల్, ఓకేషనల్ స్కిల్స్ అభివృద్ధి చేసే సెంటర్స్ను పెద్దఎత్తున ప్రారంభించి స్వయంగా పరిశ్రమలు స్థాపనకు సహకారం అందించాలి.
● అక్రమంగా నిర్భందించబడి నిర్దోషులుగా ప్రకటింపబడిన యువతకు నష్టపరిహారం అందించాలి. విద్య, ఉపాధి అవకాశాలు పొందేందుకు వారికి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles