కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ మంత్రిత్వ శాఖ తొలిసారిగా దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మేనేజిమెంట్, ఫార్మసీ కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. నాలుగు క్యాటగిరీల్లో టాప్ 100 జాబితాతో ఇండియా ర్యాంకింగ్స్-2016 విడుదల చేసింది.
ఇప్పటివరకు దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకింగ్ విధానం లేదని తొలిసారిగా ప్రకటించడం ద్వారా వివిధ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులకు ఏ విద్యాసంస్థ అయితే బాగుంటుందనే దానిపై అవగాహన ఉంటుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ తెలిపారు.
దేశంలోని మొత్తం 3600 ఉన్నత విద్యా సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానించామని, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ సంస్థ ఈ ర్యాంకుల ప్రక్రియలో చురుకైన పాత్ర పోషించిందని తెలిపారు. విద్యా సంస్థల్లో బోధన – అభ్యాసం, పరిశోధన, వృత్తిపరమైన (ప్రొఫెషనల్) ప్రావీణ్యత, ఎక్కువ సంఖ్యలో పట్టభద్రులు ఉత్తీర్ణులు కావడం, ఉపాధి అవకాశాలు (ప్లేస్మెంట్స్) లభించడం, సమాజంలో ఆ విద్యా సంస్థపై ఉన్న సాధారణ అభిప్రాయం… ఇలా ఆరు అంశాల్లో ఆయా విద్యా సంస్థలకు లభించిన మార్కుల శాతాన్ని బట్టి ర్యాంకులను ప్రకటించామని తెలిపారు.
ర్యాంకింగ్ వెనకబడిపోయిన విద్యా సంస్థలు ఇప్పుడు వచ్చిన ర్యాంకులను స్పూర్తిగా తీసుకుని ఆరోగ్యకరమైన పోటీ ద్వారా భవిష్యత్తులో మెరుగైన స్థానాన్ని పొందడానికి వీలు కలుగుతుందన్నారు. ఇదే తొలిసారి అయినప్పటికీ ఇకపై ప్రతి సంవత్సరం ర్యాంకులను ప్రకటిస్తామని, తద్వారా ఆయా విద్యా సంస్థలు పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్పష్టత ఏర్పడుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మన విద్యా సంస్థల ర్యాంకులను బట్టి గుర్తింపు అభిస్తుందని అన్నారు.
అర్చిటేక్చర్ రంగం లొ కాలేజి లు ఆసక్తి చూపనందున వాటికి ర్యాంకులు ఇవ్వలేదు. వర్సిటీలు, ఇంజినీరింగ్ విభాగాల్లో టాప్ 100 స్థానాలను, మేనేజ్మెంట్, ఫార్మ విద్యా సంస్థల్లో టాప్ 50 విద్యాసంస్థల ర్యాంకులను హచిర్డీ శాఖ ప్రకటించింది.
టాప్ ర్యాంకులన్నీ ఐఐటీలవే
ఇంజనీరింగ్ విభాగంలో ఒకటి నుండి 12వ ర్యాంకు దాకా ఐఐటీలే సాధించాయి. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ రంగంలోని ఐఐఎంలే తొలి పది ర్యాంకులనూ కైవసం చేసుకున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల లోని విద్య సంస్థల ర్యాంకింగ్: మొత్తం 16 సంస్థలకు ర్యాంకింగ్స్ 2016లో చోటు లభించినది.
విశ్వవిద్యాలయాల కేటగిరిలో వంద యూనివర్సిటీల జాబితా లో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు విశ్వవిద్యాలయాలకే ఈ జాబితాలో స్థానం లభించింది. ఇందులో మూడు తెలంగాణకు, మూడు ఆంధ్రప్రదేశ్కు చెందినవి ఉన్నాయి.
తెలంగాణా యూనివర్సిటీల్లో హెచ్నియూకి నాలుగో స్థానం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఉ స్మానియా యూనివర్సిటి వరుసగా 23, 33వ స్థానాలు దక్కించుకొన్నాయి.
ఇంజినీరింగ్ విభాగం:
ఐఐటి హైదరాబాద్ 7వ ర్యాంక్, వరంగల్ 28 ర్యాంక్, సి.బి.ఐ.టి 71 ర్యాంక్, ఆంధ్ర ప్రదేశ్ నుంచి కే.ల్. యునివర్సిటీ 59 ర్యాంక్, శ్రీ రామకృష్ణ రాజు ఇంజినీరింగ్ కాలేజీ, భీమవరం 73 వ ర్యాంక్, విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ 88 వ ర్యాంక్ పొందినవి.
-మ్యానేజ్మెంట్ విభాగం లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ 38వ ర్యాంక్ పొందినది.
ఫార్మా రంగం లో తెలంగాణా యూనివర్శిటీ అఫ్ ఫార్మాసూటికల్ సైస్సెస్, వరంగల్ 16వ స్థానం పొందినది. ఆంధ్ర ప్రదేశ్ లో రాఘవేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యువేషన్ అండ్ రిసర్చ్ () అనంతపూర్కు 20 వ ర్యాంక్ లభించినది.



