ఎస్.ఐ.ఓ. తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిత్వవికాసం (పర్సనాలిటీ డెవలప్మెంట్) అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అందులో ఎస్.ఐ,ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్రార్ అలీ మాట్లాడుతూ విద్యార్థులు నైతిక ఉన్నతమైనా విలువలను ఎలా పెంపొందించుకోవాలి, సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే తమ లక్ష్యాలను చేరుకుంటారో సూచించారు.
విశ్వాసం ప్రతి వ్యక్తిని ముందుకు నడిపిస్తుందని విలువలను పెంపొందించుకునేలా తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇస్లామీయ జీవన విధానం సమాజంపై బాధ్యతను గుర్తు చేస్తూ వ్యక్తి-సమాజం మే తన అభివృద్ధికి మెట్లు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్.ఐ.ఓ. స్థానిక బాధ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నమ్మర్ క్యాంప్ (వేసవి తరగతులు) ద్వారా విద్యార్థులకు విలువలతో కూడిన శిక్షణ
ఎస్.ఐ.ఓ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మర్ క్యాంట్లు (వేసవి శిక్షణా తరగతులు) నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఇస్లామియా జీవన విధానం ఉత్తమమైన ఆలోచన సరళిని పెంపొందించే దిశగా అనేక విషయాలు తెలియజేశారు. ధార్మిక విషయా లతో పాటు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ జీవనంపై అవగాహన ప్రస్తుత విద్యా ఉన్నతమైన విలువలను అలవర్చుకునే విధంగా విద్యార్థులకు, శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో -ఆంధ్రరాష్ట్ర పౌర కార్యదర్శి ఖలీల్ భాష పాల్గొని బహుమతులను ప్రదానం చేశారు.



