స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర పౌర సంబంధాల కార్యదర్శి అజరుద్దీన్ హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో జరిగిన ఘటనపై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఇది విద్యార్థి లోకానికి దిగ్భ్రాంతి కరమని విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నా వర్శిటీ యాజమాన్యం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి చర్యల వల్ల రోహిత్ తన విలువైన జీవితాన్ని కోల్పో యాడన్నారు. వరుసగా జరుగు తున్న ఇలాంటి ఘటనల వల్ల సమాజంలో ఉండే మేధావి వర్గం, మరియు విద్యార్థులు ఇలాంటి కుయుక్తులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉందని తెలిపారు.1. వర్శిటీ వైసాఛాన్సలర్ అప్పారావును వెంటనే సస్పెండ్
చేయాలి.
2. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, యం.ఎల్.సి. రామచంద్రరావుపై ఎస్.సి.ఎస్.టి. కేసులు పెట్టి వెంటనే వారిని పదవుల నుండి తొలగించాలి.
3. హైకోర్టు జడ్జీ ద్వారా నిష్పక్షపాత విచారణ చేపట్టాలి.
4. ఈ ఘటనకు సూత్రదారియైన ఎబివిపి అధ్యక్షుడు, సుశీల్ కుమార్ను అరెస్ట్ చేయాలి.
5.ప్రొ॥ ఫైజాన్ ముస్తఫా కమిటీ సమర్పించిన విషయాలు ప్రత్యేకంగా దళిత విద్యార్థులు వర్శిటీలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి.
6. ప్రస్తుత ఇన్ఛార్జి వి.సి. శ్రీవాస్తవ్ నియమాకాన్ని రద్దు చేయాలి..
7.రోహిత్ కుటుంబాన్ని కేంద్రం ప్రభుత్వం ఆదుకోవాలి.
రోహిత్ మృతి కారణంగా హెచ్.సి.ఓను సందర్శించిన ఎస్.ఐ.ఓ. జాతీయ అధ్య క్షులు ఇక్బాల్ హుసేన్ రోహిత్ మృతిపై తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అక్కడ దీక్ష చేస్తున్న ఏ.ఎస్.ఏ. విద్యా ర్థులకు తన సంఘీభావాన్ని తెలియ జేశారు. ఆయన మాట్లాడుతూ ఇది కేవలం ఆత్మహత్య కాదు, ఇదొక ఇన్స్టిట్యూషనల్ హత్యగా పరిగణించారు. దీని వెనుక వర్శిటీ వైస్ ఛాన్సలర్ కేంద్ర హెచ్.ఆర్.డి. మంత్రి ఎం.పి. మరియు ఇతర విద్యార్థి సంస్థ సభ్యులు పన్నిన కుట్ర వల్లనే రోహిత్ మృతికి కారణమయ్యాడని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దేశ పౌరుల స్వేచ్ఛను హరించేస్తుందన్నఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో రాష్ట్ర మరియు కేంద్ర విశ్వ విద్యాలయాల్లో తమ మతోన్మాద ఎజెండాను వ్యాపింపజేసే ప్రయత్నం జరుగుతోందని దీనివల్ల దేశంలో అలజడులు చెలరేగుతున్నాయని తెలిపారు. రోహిత్ మృతి కూడా దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు.



