Friday, November 27, 2026
spot_img

మహబూబ్నగర్ జిల్లాలోని ఎస్.ఐ.ఓ. ఉట్కూరు శాఖ స్టూడెంట్స్ సెంటర్ మరియు లైబ్రరీని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ మల్టిక్ షారిఖ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించటానికి గ్రంథాలయాలు ప్రముఖపాత్ర వహిస్తాయని జ్ఞానాన్ని పొందటానికి అనువైన ప్రదేశాలు అని తెలిపారు. స్టూడెంట్స్ సెంటర్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించటానికి చక్కనివేదిక అని, వీటి ద్వారా -విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంచుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నూతన విద్యా విధానం సిఫార్సులు అనే శీర్షికతో కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు కార్యదర్శులు పాల్గొని నూతన విద్యా విధానంపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో పటిష్ఠత కొరకు పాలకులు, విద్యావంతులు చేపట్టవలసిన విధానాలను తెలియజేశారు. ప్రాథమిక,ఉన్నత మరియు సాంకేతిక విద్యలో సంస్కరణలు అవసరమని రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని తెలిపారు.

ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో జరిగిన నూతన విద్యా విధానం కార్యక్రమంలో ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా, ఎస్ఐఓ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు కరీముద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుర్రహ్మాన్ సూఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా గారు మాట్లా డుతూ విద్య నేటి సమాజానికి ఆయువుపట్టు లాంటిది. ఇలాంటి విశిష్టత కలిగిన విద్యారంగాన్ని నేడు మన పాలకులు పట్టించుకోకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠ్యాంశాలలో తీసుకు వస్తున్న మార్పులు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు కరీముద్దీన్ మాట్లాడుతూ. | ఉపాధ్యాయుల శిక్షణలో సామాజిక శాస్త్రాలు మరియు వాటి ప్రాముఖ్యతను రాబోయే తరాలకు అందజేయడం తక్షణ అవసరమని అన్నారు. బోధనా పద్ధతులలో ప్రయోగాత్మకతను పెంపొందించే విధంగా పాఠ్యాంశ రూపకల్పన చేయాలని ఆయన సూచించారు.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో జరిగిన నూతన విద్యా విధానం కార్యక్రమంలో ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా, ఎస్ఐఓ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు కరీముద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుర్రహ్మాన్ సూఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా గారు మాట్లాడుతూ విద్య నేటి సమాజానికి ఆయువుపట్టు లాంటిది. ఇలాంటి విశిష్టత కలిగిన విద్యారంగాన్ని నేడు మన పాలకులు పట్టించుకోకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠ్యాంశాలలో తీసుకు వస్తున్న మార్పులు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు కరీముద్దీన్ మాట్లాడుతూ. | ఉపాధ్యాయుల శిక్షణలో సామాజిక శాస్త్రాలు మరియు వాటి ప్రాముఖ్యతను రాబోయే తరాలకు అందజేయడం తక్షణ అవసరమని అన్నారు. బోధనా పద్ధతులలో ప్రయోగాత్మకతను పెంపొందించే విధంగా పాఠ్యాంశ రూపకల్పన చేయాలని ఆయన సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles