Friday, November 27, 2026
spot_img

ఈ క్షణాన్ని విస్మరించకు

ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ధనాన్ని, ప్రాణాన్ని, తన సంతానాన్ని ఎంతో ప్రేమిస్తాడు. అతనికి అవి అమూల్యమైనవి. వీటిని పొందేందుకు రాత్రింబవళ్లు ఎంతో కష్టపడుతాడు. వాటిని పొందటానికి ధర్మ సమ్మతమైన మార్గమైన, అధర్మమార్గమైన పట్టించు కోడు. కొన్ని సందర్భాల్లో సంపదను పొందటానికి తన ప్రాణాన్ని కూడా అర్పిస్తాడు. దివ్వ ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియ జేస్తున్నాడు.

వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాన మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది. (102: 1-2)

ధన సంపదలపై ఉన్న ఈ ప్రేమనే మానవున్ని మానవత్వం నుంచి దిగజార్చి పశువుగాను, ఇంకా చెప్పాలంటే పశువు కన్నా అధ్వానంగా తయారు చేసింది.

తాను ఏ ఆశయ సాధనకైతే సృష్టిం పబడ్డాడో తెలియక పోవటం వల్ల తన సృష్టికర్త యజమాని అయిన దేవునికి దూరం అవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడయితే మానవుడు తన వాస్తవ యజమాని అయిన దేవుని గురించి తెలుసుకుంటాడో దేవుని అస్థిత్వం గురించి తెలుసుకుంటాడో అప్పుడు ఈ ధన సంపదలు, ఈ లోకం లోను, పరలోకంలోను మానవుని విజయానికి తోడ్పడుతాయి.

ఏ మానవుడయితే తనకు ఇష్టమయిన ధన సంపదలను అల్లాహ్ ధర్మాన్ని ప్రచారం చేయుటకు విస్తరింప చేయుటకు అల్లాహ్ ధర్మం యొక్క ఆధిపత్యాన్ని స్థాపించుట కొరకు, బలహీనులయిన మరియు అక్కర గల మానవులపై ఖర్చు చేస్తారో అలాంటి మానవులకొరకు లభించే బహుమానాల గురించి ఖుర్ఆన్ లో, హదీస్ గ్రంథాలలో ముహమ్మద్ (సఅసం) ద్వారా తెలియజేయ బడింది.

అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడ మంటే గొప్ప బహుమానాన్ని, పొందడమే

తమ సంపాదన అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే వారి ఖర్చు ఉపమానం ఇలా ఉంటుంది.

“వారికి మేమిచ్చిన దాని నుంచి (మా మార్గంలో ఖర్చు పెడతారు. అటువంటి వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు వారి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. తప్పులకు మన్నింపు ఉంది. శ్రేష్ఠమైన ఆహారం కూడా ఉంది.” (ఖురాన్ 8:4)

ఒక విత్తనాన్ని నాటితే, అది మొలచి ఏడు వెన్నులను ఈనుతుంది. ప్రతి వెన్నుకు నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింపజేస్తాడు. అల్లాహ్ అమి తంగా ఇచ్చేవాడు, అన్నీ తెలిసినవాడునూ. (2:261)

అల్లాహ్ మార్గంలో ధన సంపాదనను ఖర్చు చేయడం వలన లభించే పారితో షికం మరియు పుణ్యం గురించి ఒక ఉదాహరణ ద్వారా ఈ వాక్యంలో తెలియజేయబడింది. ఏ మానవుడైతే పరలోక పుణ్యం, అల్లాహ్ ప్రసన్నత కొరకు నిర్మల మైన మనస్సుతో, చిత్తశుద్ధితో సంపూర్ణ హృదయంతో అల్లాహ్ మార్గంలో ధన సంపదలను ఖర్చు పెడతాడో అటువంటి వారికి, అన్ని విషయాలు తెలిసిన అల్లాహ్ బహుమానాన్ని, పుణ్యాన్ని ఎంతో ఎక్కువగా చేసి ఇస్తాడు. ఈ ప్రపంచంలో మనం దాన్ని గురించి ఊహించలేము. ఒక హదీసులో ప్రవక్త మహనీయులు (స) తెలియజేసారు. “ఒక విశ్వాసి దేవుని మార్గంలో ఒక ఖర్జూరపు పండు కూడా దానం చేస్తే అల్లాహ్ దాని పుణ్యాన్ని ఉహద్కొండంత చేసి ఇస్తాడు.”

అల్లాహ్ మార్గంలో చేసే ఖర్చు సన్మార్గం వైపునకు తీసుకువెళుతుంది

ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారో వారికి లభించే ఒక గొప్ప విషయం గురించి ఈ విధంగా చెప్పబడింది: షైతాన్ మిమ్మల్ని బీదరికం గురించి భయపెడుతున్నాడు, సిగ్గు మాలిన పనులు చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు. కానీ అల్లాహ్ క్షమాపణ గురించి, తన కారుణ్య ప్రసాదాల గురించి మీకు తెలియజేస్తున్నాడు. అల్లాహ్ ఎంతో ఎక్కువగా ఇచ్చేవాడు, మరియు వివేక వంతుడు.

షైతాన్ ప్రతి క్షణం కూడా మానవుని సంపదలను ప్రేమించే వాడిగా చేస్తూ మానవున్ని ఏమని భయపెడతాడంటే “నీవు నీ సంపదలను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే, నీ సంపద తరిగిపోతుంది, నీవు బీదవాడివై పోతావు”, కానీ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే అల్లాహ్ క్షమాపణ లభిస్తుంది. మరియు అల్లాహ్ కారుణ్యం బహుమానం కూడా లభిస్తాయని అల్లాహ్ అంటున్నాడు.

“వారికి మేమిచ్చిన దాని నుంచి (మా మార్గంలో ఖర్చు పెడతారు. అటువంటి వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు వారి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. తప్పులకు మన్నింపు ఉంది. శ్రేష్ఠమైన ఆహారం కూడా ఉంది.” (ఖురాన్ 8:4)

ఎవరి మనస్సులయితే అల్లాహ్ ధర్మమే యదార్థమని దానిని మానవులం దరికీ తెలియజేసి దాని ఆధిపత్యాన్ని స్థాపించాలని తద్వారా కరుణామయుడు అయిన అల్లాహ్ తో మానవుల సంబంధాన్ని పటిష్టం చేయాలని చెబుతున్నాయో (మనస్సులు సాక్ష్యం ఇస్తున్నాయో) అటువంటి వారి ఆలోచన, తమ ధన సంపద లను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం

అవసరమని వెల్లడవుతుంది. అల్లాహ్ ఇచ్చిన దాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం అనేది దృఢ సంకల్పం గల వారి లక్షణం.

మిత్రులారా పైన వివరించిన గుణ గుణాలు, శుభాలు పొందుటకు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలని తన క్యాడర్ను ఎస్ఐఓ కోరుతున్నది.

సంస్థ సంబంధీకులు, శ్రేయోభిలాషులు ప్రతీసారి సంస్థ యొక్క ఈ పిలుపును ఎంతో ఉత్తేజంతో, చిరునవ్వుతో స్వీకరించారు.

సోదరులారా… ఈ మిఖాత్ యొక్క “ఇన్ఫాక్-వీక్’ మార్చి 1వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఇన్షా అల్లాహ్ సభ్యులు, సంబంధీకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను.

ఇన్ఫాఖ్ ఫీ సబీలిల్లాహ్ (దైవ మార్గంలో ఖర్చు చేయడం) యొక్క ప్రాముఖ్యతను తెలియజేయుట కోసం స్థానికంగా కేడర్ మీట్ను ఏర్పాటు చెయ్యవలెను.

అల్లాహ్ ఈ మార్గంలో సహాయం చేయుగాక!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles