మనం ఆస్తిపాస్తులను సంపాదించుకోగలం, సంపదలను కూడబెట్టగలం. కాని కరిగిపోయిన కాలాన్ని తిరిగి పొందలేము. కాలం అంత విలువైనది. ముఖ్యంగా విద్యార్థులు ఒక వృత్తిలోనో వ్యాపారంలోనో స్థిరపడేంత వరకు కాలాన్ని వృధా చేసుకోరాదు.
హైస్కూలు విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు సెలవులు ప్రారంభ మయ్యాయి. చాలామంది విద్యార్థులు అమూల్యమైన తమ సమయకాన్ని వృధా చేసుకుంటుంటారు. బుల్లితెరకు అతుక్కు పోయే బల్లుల్లాగా మారుతారు. ఎక్కువ సేపు టి.వి. చూడటం వలన కంటికి వత్తిడి అని గ్రహించరు. మరి కొంతమంది ఎప్పుడు చూసినా సెల్ఫోన్ ఉపయోగిస్తూ కనిపి స్తారు. సెల్ ఫోన్ వ్యననానికి లోనుకావటం మరింత ప్రమాదకరం యువకులు దేశానికి వెన్నుముకవంటి పారు. వారు కాలం విలువ మరిచి ఇంటర్నెట్ పాయింట్స్ లో, సైబర్ కేఫ్లలో వృధాగా గడుపుతుంటారు. ఉబుసుపోక మాటలు మాట్లాడుతూ కొందరు సినిమాలు, షికార్లంటూ మరికొందరు కాలాన్ని వృధా పరుస్తుంటారు.
సెలవులను
సద్వినియోగం చేసుకోవటం ఎలా?
ఇంట్లో తమకన్నా చిన్న వారైన తమ్ములకు, చెల్లెళ్లకు తమకు తెలి సిన కొన్ని సబ్జెక్టులను బోధించ వచ్చు.
తల్లిదండ్రులలో కాని, ఇరుగు . పొరుగు వారిలోకాని నిరక్షరాస్యులువున్న ఎడల వారికి చదవటం, రాయటం నేర్పించవచ్చు.
రాత దిన కొత్త, చదువు నెలకొత్త అని ఒక సామెత. అంటే రాయటం కొద్దిరోజులు ఆపివేస్తే, మరలా ప్రారంభించినప్పుడు తప్పులు రాసే అవకాశముందని, అలాగే చదవటం కొద్దివారాలు ఆపివేస్తే, స్పష్టంగా వేగంగా చదివే అలవాటు తప్పి పోతుందని దాని అర్థం. అందుకే చదువును పూర్తిగా వదిలివేయక న్యూస్ పేపర్లను, మ్యాగజైన్స్ ను చదవుతుండాలి.
లైబ్రరీలో ఎన్నో ఆశక్తికరమైన పుస్తకా లుంటాయి. మంచి మంచి పుస్తకా లను చదువుకోవటం వలన మతన జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు.
స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు, కంప్యూ టర్ క్లాసులు, అలాగే వృత్తి నైపుణ్యా లకు సంబంధించిన శిక్షణ లకు హాజరు కావచ్చు.
విద్యతోపాటు,వికాసమూ వుండాలి. సెలవుల్లో విహారయాత్రలకు అమ్మమ్మ, తాతయ్య ఇళ్ళకు వెళ్ళటం సరికొత్త ఉత్సాహానిస్తుంది. చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శిస్తే సంతోషంతో పాటు విజ్ఞానాన్ని పొందవచ్చు.
సమాజ సేవ మన జీవితంలో ఒక భాగం. ఆసుపత్రులకు వెళ్ళి రోగు లకు సేవాకార్యక్రమాలు నిర్వహిం చవచ్చు. చలివేంద్రాలు నిర్వహించు కోవచ్చు. ప్రయాణీకులకు కొన్ని సేవలు అందించవచ్చు.
ఆధ్యాత్మికత మన జీవితంలో అతి ముఖ్యమైన భాగం.ఎప్పుడూ దైవాన్ని మరువక దైవధ్యానంలో గడపాలి ఆధ్యాత్మికతకు ఒక వయసు లేదు.
ఉద్యోగ ప్రయత్నాలలో వున్న విద్యా ర్థులకు కాలం మరింత విలువైనది ఎన్నో వున్త కాలు చదవవలసి వుంటుంది. వారు, వారి దిన చర్యను ఓ టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారం పోటీ పరీక్షలకు సంసిద్ధం కావాలి. విద్యార్థులు, ఇలా తమ సమయాన్ని వృధా చేసుకోకుండా సెలవలను సద్వినియోగం చేసు కున్నట్లయితే వారి భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పడుతుంది. ”



