స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వ ర్యంలో “Education Explore, Encour age SIO for a better Change” పేరిట రాష్ట్రంలోని పలు చోట్ల విద్యార్థి మహా సభలు నిర్వహించడ్డాయి. ఇందులో ముఖ్య అతిథిగా ఎస్.ఐ.ఓ. జాతీయ అధ్యక్షులు బ్రదర్ అష్ఫాక్ ఫరీఖ్ పర్యటించారు. సంస్థ సభ్యులకు దిశా నిర్దేశ చేస్తూ విద్యాలయాలలో సంస్థ పటిష్ఠతకై తగిన సలహాలు, సూచనలు అందజేశారు. సంబంధీ కులతో ముఖాముఖి చర్చించి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం సభను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే…
విద్యార్థి భవిష్యత్తు ఆర్జించే జ్ఞానంపైనే ఆధారపడి ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా అతను సర్వలోకాలకు అధిపతి అయిన అల్లాహ్ ను గుర్తించాలి. ఆయన ఆజ్ఞలకు లోబడి జీవితం గడపాలి. ముఖ్యంగా విద్యాలయాలలో తన ఉనికిని చాటుకునే నిమిత్తం భిన్నంగా వ్యవహరించాలి. అను నిత్యం సత్యధర్మ శోధనకై పరితపిస్తూ తోటి విద్యార్థులతో నైతికంగా ఉన్నత రీతిలో వ్యవహరించాలి. ర్యాగింగ్, టీజింగ్ లాంటి దుష్కార్యాలకు దూరంగా ఉంటూ తోటి విద్యార్థులకు దీని పట్ల అవగాహన కల్పించాలి. వాటి పట్ల కలిగే దుష్పరిణామాలను వివరించాలి. ఈ విధంగా విద్యాలయాలలో చెడును రూపుమాపటానికి మంచిని ప్రోత్సహించడానికి ముందంజలో ఉండాలి. సంస్థ ఆశయాల పట్ల ఇతరులకు అవగాహన కల్పించాలి. తోటి విద్యార్థుల నైపుణ్యాలకనుగుణంగా వారిని సంస్థ పనిలో భాగస్వాములుగా చేయాలి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటూ గొప్ప వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచాలి. సహనం, ధైర్యం, మాట నెరవేర్చటం లాంటి ఉత్తమ గుణాలను అలవర్చుకోవాలి. ఈర్ష్య, ద్వేషం లాంటి దుర్గుణాల దరిచేరనీయకూడదు. ఇలాంటి అత్యుత్తమ నడవడికకై ప్రవక్త (స)ల జీవిత చరిత్రను అధ్యయనం చేయాలి.
ఒకసారి మహా ప్రవక్త ముహమ్మద్ (స) కాలినడకను వెళుతుండగా ఒక వృద్ధ మహిళ తారసపడి తనకు సహాయపడ వలసినదిగా కోరింది. వెంటనే ప్రవక్త (స) వారు ఆమెకు సహాయపడటానికి సిద్ద మయ్యారు. వృద్ధ మహిళ యొక్క బరువును తన భుజంపై పెట్టుకుని నడవ సాగారు. అయితే వృద్ధురాలు తన ప్రయాణానికి కారణం చెబుతూ, మక్కా పట్టణంలో ఒక దారి తప్పిన యువకుడు కొత్త మతాన్ని బోధిస్తున్నాడని, అతని మాట విన్నవారు అనుయాయులుగా మారిపోతున్నారని, తమ పూర్వీకుల మతం కాపాడుకోడానికి పట్టణం విడిచి వెళుతున్నానని విలపించింది. ఆ క్రమంలో ఆ యువకుణ్ణి దూషించి నోట దురుసుతనంతో ప్రవర్తించిన వృద్ధురాలు సహనం కోల్పోయింది. ఆ నవ యువ కుడు ముహమ్మద్ (స) అని ఆమెకు తెలి యదు. అన్యాయంగా ఆమె దూషిస్తున్నా, ప్రవక్తమహనీయులు సహించారు. కానీ మారుమాట్లాడలేదు. ఇది ప్రవక్త (స)ల గొప్ప సహనశీలతకు తార్కాణం. తమను నిందించినా ఎదుటివారి భాగ్యం కోరేవారే ప్రవక్త శ్రేష్టులు.
సంస్థ సభ్యులు కూడా ప్రవక్తల అడుగు జాడల్లో నడవాలి. తద్వారా విద్యాల యాలు సంస్కరణశుద్ధికి పాటుపడాలి. తమ వ్యక్తిత్వం ద్వారా ఉన్నత విలువలు కలిగిన వాతావరణం పెంపిందించాలి. తోటి వారిలో కలుపుగోలుతనంతో వ్యవ హరించాలి. సహనం, దయ, సానుభూతి కలిగిన ప్రవర్తన ద్వారా స్నేహితులకు సహాయపడాలి.
ప్రస్తుతం విద్యాలయాలు అనేక సమస్యలతో సతమవుతూ వున్నాయి. విద్యా బుద్ధులు బోధించే కళాశాలలు పరిష్కా రాలు లేని సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే విద్యార్థుల భవితవ్యం సంకటలో పడే ప్రమాదం వుంది. కాబట్టి సంస్థ సభ్యుడు విద్యార్జనతోపాటు సంస్కరణా నైపుణ్యాలను ఇనుమడింపజేసుకోవాలి. ప్రతి సమస్యకు స్వశక్తి ద్వారా పరిష్కారాన్ని కను గొనాలి. తద్వారా గుర్తింపును చాటు కుంటూ సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలి. ఖుర్ఆన్లో ఇలా సెల వియ్యడం జరిగింది.
“అందరిలోకెల్లా ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చెయ్యండని ఆజ్ఞాపిస్తారు. చెడును నివారిస్తారు. అల్లాహక్కు భయ పడుతూ ఉంటారు”
మంచిని పునఃస్థాపించడానికి కృషి చేస్తూ, చెడును అడ్డుకునే ప్రయత్నం చేసే సజ్జనులు వున్న సమాజాన్ని దివ్యఖుర్ఆన్ ‘ఉత్తమ సమాజంగా” పేర్కొంది. ఆ సమా జంలోని వ్యక్తి ఉత్తమ వ్యక్తిగా అభివర్ణిం చింది. విలువలతో కూడిన సమాజం అధిష్టించబడాలని, నీతి రాహిత్యం అంత మవ్వాలన్నా ‘ఉత్తమ సమాజం’ అవసరం అత్యంతావశ్యకం,
విద్యాలయాలు సమాజానికి పునాదుల్లాం టివి. విద్యాలయాల పురోగతిపైనే సమా జాభివృద్ధి ఆధారపడి ఉంది. విద్యా లయాల అధోగతిపైనే సమాజ పతనం ఆధారపడి వుంది. కాబట్టి విద్యార్థులలో ఉన్నత సామాజిక నైతిక విలువలను జనింపజేయాలి. ఈ మార్పు ధార్మిక విద్య ద్వారానే సాధ్యమవుతుంది. ధార్మిక విద్య దైవభీతిని జనింపజేసి తన నిజకర్తవ్యాన్ని తెలియజేస్తుంది. జవాబు దారీ తనాన్ని నెలకొల్పుతుంది. తద్వారా చెడుల నిర్మూ లనకు, విలువల స్థాపనకు ఆస్కారం ఏర్పడుతుంది. నవ భారత నిర్మాణంలో క్యాంపస్లు తమ వంతు పాత్ర పోషిస్తే భారత్ అన్ని కోణాల్లో పురోభివృద్ధి సాధి స్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
నేటి ఈ ఆధునిక యుగంలో ప్రతి రంగం లోనూ ఎంతో కొంత జ్ఞానం కలిగే ఆల్ రౌండ్స్కు స్థానం లేదు. ఏదో ఒక రంగంలో స్పెషలైజేషన్ చేసిన వారికే విజయం వరిస్తుంది. కాబట్టి Know something about every thing. But know everything about something.



