- అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోండి. హడావుడిగా చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి వెళ్లవద్దు.
2.ఏ రూమ్ మీ నెంబరు ఉందో చూసి 10 నిమిషాల ముందుగానే రూమ్ కు చేరుకోండి. రూమ్ కోసం వెతుకులాడి అనవసరంగా టెన్షన్ పడవద్దు.
- అన్నిటికన్నా ప్రధానం మీ హాల్ టికెట్ మరిచపోవద్దు.
4.ఇన్విజిలేటర్ ఆన్సర్ పేపర్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా హాల్ టికెట్ నెంబరు, రూమ్ నెంబర్, మీ సంతకం మొదలగునవి తప్పులు లేకుండా హడావుడి లేకుండా నింపండి.కొట్టివేతలు, దిద్దుబాటులు లేకుండా చూసుకోండి.
- ప్రశ్నాపత్రాన్ని జాగ్రత్తగా చదవండి. దానిపై మీ నెంబరు తప్ప ఇతర విషయాలు రాయకండి.
- మీరు రాసేది గుండ్రంగా, స్పష్టంగా కనిపించేటట్లు మరి పెద్దవి కాని చిన్నవి కాని కాకుండా అక్షరాలు ఉండేటట్లు చూడండి.
- గుడ్ హ్యాండైటింగ్ అదనపు మార్కులు తెచ్చిపెడతుంది.
8.మార్జిన్స్ తో సైడ్ హెడ్డింగ్ లతో పేరాల వారీగా ఆన్సర్లు రాయాలి.
- అవసరమైన చోట్ల అండర్లైన్ చేయండి. వీలైన చోట డయాగ్రమ్స్ వేయండి.
- ఒక్కొక్క ప్రశ్న ఇంత టైం అనుకొని ఆ సమయం లోపల రాయండి.
- కొంచెం అయిన తెలిసిన దానిని తప్పులు లేకుండా జాగ్రత్తగా రాయండి. అనవసరంగా ఎక్కువ రాసి ఎక్కువ తప్పులు చేయకండి. ముఖ్యంగా లాంగ్వేజ్ పేపర్స్ లో ఎక్కువ తప్పులు ఉండరాదు.
- ప్రశ్నాపత్రంలో ఇచ్చిన సూచనలు పాటించండి. షార్ట్నట్స్, బిట్స్ వరుస క్రమంలో రాయండి. అక్కడ ఇక్కడా రాయవద్దు.
- ఇతరుల పేపర్లలో చూచి రాయవద్దు లేదా ఇతరులకు చూపించవద్దు.
- చివరి 5 నిమిషాలు రాసినది చూసుకోండి. ప్రశ్న నెంబరులు సరిగా వేశారో లేదో చూసుకోండి.
- లాస్ట్ బెల్ కొట్టగానే ఆన్సర్ పేపర్ ఇచ్చేయండి. కొంచెం ఉంది అనవద్దు. ఇన్విజిలేటర్ కు కోపం తెప్పించవద్దు.
మీరు పరీక్షలు వ్రాసేటప్పు ఈ 15 చిట్కాలు గనక అనుసరించినట్లయితే మంచి మార్కులతో విజయాన్ని సాధించటానికి చాలా సులువుగా ఉంటుంది.



