Friday, November 27, 2026
spot_img

పరీక్షా సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  1. అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోండి. హడావుడిగా చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి వెళ్లవద్దు.

2.ఏ రూమ్ మీ నెంబరు ఉందో చూసి 10 నిమిషాల ముందుగానే రూమ్ కు చేరుకోండి. రూమ్ కోసం వెతుకులాడి అనవసరంగా టెన్షన్ పడవద్దు.

  1. అన్నిటికన్నా ప్రధానం మీ హాల్ టికెట్ మరిచపోవద్దు.

4.ఇన్విజిలేటర్ ఆన్సర్ పేపర్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా హాల్ టికెట్ నెంబరు, రూమ్ నెంబర్, మీ సంతకం మొదలగునవి తప్పులు లేకుండా హడావుడి లేకుండా నింపండి.కొట్టివేతలు, దిద్దుబాటులు లేకుండా చూసుకోండి.

  1. ప్రశ్నాపత్రాన్ని జాగ్రత్తగా చదవండి. దానిపై మీ నెంబరు తప్ప ఇతర విషయాలు రాయకండి.
  1. మీరు రాసేది గుండ్రంగా, స్పష్టంగా కనిపించేటట్లు మరి పెద్దవి కాని చిన్నవి కాని కాకుండా అక్షరాలు ఉండేటట్లు చూడండి.
  1. గుడ్ హ్యాండైటింగ్ అదనపు మార్కులు తెచ్చిపెడతుంది.

8.మార్జిన్స్ తో సైడ్ హెడ్డింగ్ లతో పేరాల వారీగా ఆన్సర్లు రాయాలి.

  1. అవసరమైన చోట్ల అండర్లైన్ చేయండి. వీలైన చోట డయాగ్రమ్స్ వేయండి.
  1. ఒక్కొక్క ప్రశ్న ఇంత టైం అనుకొని ఆ సమయం లోపల రాయండి.
  1. కొంచెం అయిన తెలిసిన దానిని తప్పులు లేకుండా జాగ్రత్తగా రాయండి. అనవసరంగా ఎక్కువ రాసి ఎక్కువ తప్పులు చేయకండి. ముఖ్యంగా లాంగ్వేజ్ పేపర్స్ లో ఎక్కువ తప్పులు ఉండరాదు.
  1. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన సూచనలు పాటించండి. షార్ట్నట్స్, బిట్స్ వరుస క్రమంలో రాయండి. అక్కడ ఇక్కడా రాయవద్దు.
  1. ఇతరుల పేపర్లలో చూచి రాయవద్దు లేదా ఇతరులకు చూపించవద్దు.
  1. చివరి 5 నిమిషాలు రాసినది చూసుకోండి. ప్రశ్న నెంబరులు సరిగా వేశారో లేదో చూసుకోండి.
  1. లాస్ట్ బెల్ కొట్టగానే ఆన్సర్ పేపర్ ఇచ్చేయండి. కొంచెం ఉంది అనవద్దు. ఇన్విజిలేటర్ కు కోపం తెప్పించవద్దు.

మీరు పరీక్షలు వ్రాసేటప్పు ఈ 15 చిట్కాలు గనక అనుసరించినట్లయితే మంచి మార్కులతో విజయాన్ని సాధించటానికి చాలా సులువుగా ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles