అక్టోబర్ 1906లో ఓ రోజు ఉదయం శేఖ్ అహ్మద్ గారి ఇల్లుంతా కోలాహలంగా ఉంది. ఇంట్లో ఓ పక్కన ఓ వృద్ధురాలు శేఖ అహ్మద్ దగ్గరికొచ్చి శుభాకాంక్షలు తెలిపింది. దేవుడు ఆయనకు ఓ కుమారుడు కలుగచేశాడు. బిడ్డ పుట్టిన 7రోజులకు శేష్ అహ్మద్ తన బిడ్డకు సున్నతె అఖిక చేసి బిడ్డ పేరు ‘హసన్’ అని పేరు పెట్టారు.
హసనుల్ బన్నా’ కుటుంబం పల్లెటూరిలో ఉండినా వారి చుట్టు పక్కల వాతావరణమంతా విద్యా మరియు ఇస్లామీయ సంస్కృ తితో ముడిపడి ఉంది. తన కొడుకు బాగా చదువుకోవాలని శేఖ్ అహ్మద్ చాలా శ్రద్ధ తీసుకునేవాడు. ఆయన తన కొడుకుని సహాబా గారి గాథలను వర్ణిస్తూ ఉండేవారు. తన కొడుకు కూడా సహాబా వలె ధైర్యవంతులు, నీతిమంతులు, న్యాయవంతులు మరియు సత్యవంతుల్లాగా కావాలని శ్రమపడేవారు.
హసనుల్ బన్నా’ ఏడు సంవత్సరాల వయస్సు అయిన తర్వాత, ఆయన తండ్రి బన్నా మరియు బన్నా తమ్ముడు అబ్దుర్రహ్మాన్ ని ప్రాథమిక శిక్షణ కోసం ఊరి పాఠశాలలో చేర్పించారు. ఇది ఇస్లా మీయ ప్రాథమిక పాఠశాల. మహమ్మద్ జోహన్ గారు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. ఆయన దైవభీతిగల పండితుడు. జొహన్ గారు ఫజర్ నమాజ్ తర్వాత ప్రజలకు దివ్యఖుర్ఆన్ హితవులను బోధించేవారు. రోజంతా పాఠశాలలో విధులు నిర్వర్తించేవారు. సాయంత్రం వేళల్లో మహమూదియా పట్టణంలోని ప్రతీ ఇంట్లో అక్కడున్న స్త్రీ మరియు పురుషులకు జీవన విధానాలు నేర్పేవారు. పాఠశాలలో సాధారణ మరియు ఇస్లాం పాఠ్యాంశం రెండూ బోధించబడేవి. గురువు జొహ్రాన్ గారు విద్యార్థుల్లో వైతికాంశాలను పెంపొందించేందుకు ఎక్కువ కృషి చేసేవారు. విద్యార్థుల చిన్న చిన్న తప్పులను సరిదిద్దేందుకు ప్రయత్నించేవారు: ఎవరైనా మంచి పనులు చేస్తే ఆ విద్యార్థికి గురువుగారు బహుమానం ఇచ్చి సత్కరించేవారు. అందుకే ప్రతీ విద్యార్థి జొహ్రాన్ గురువుగారిని సహృదయంతో ఆదరించేవారు.
హసనుల్ బన్నా చిన్ననాటి నుండే క్రమం తప్పకుండా నమాజు పాటించేవాడు. రోజా (ఉపవాసం) ఉండేవాడు. ప్రతీరోజు సహరీ సమయానికి లేచి తహజ్ఞుద్ నమాజు పఠించేవాడు. అనంతరం
తమ్ముడు అబ్దుర్రహ్మాన్ ను ఫజర్ నమాజ్ కొరకు లేపేవాడు. ఇద్దరు నమాజు పఠించిన తర్వాత ఈ రోజు చేయవలసిన పనుల గురించి తమ్ముడికి చెప్పేవాడు ఆ ప్రణాళిక ఈ విధంగా ఉండేది:
ఉదయం 5 గం. నుండి 6 గం. వరకు దివ్యఖుర్ఆన్ పఠించే సమయం ఉదయం 6 గం. నుండి 7 గం. వరకు తప్పిర్ మరియు హదీసు చదివే సమయం.
తర్వాత వారు ఇంటి పనులు చేసి పాఠశాలకు వెళ్లిపోయేవారు. ఈ విధంగా ఇంటి విద్య సాగుతూ ఉండేది. ఈ పాఠశాలలో హసనుల్ బన్నా 4 సంవత్సరాలు గడిపాడు. కొంతకాలం తర్వాత గురువు జోహన్ గారు రోజువారి విధులను విడిచిపెట్టి విద్యా స్వేషణలో లీనమయ్యారు. ఆ తర్వాత పాఠశాలలో క్రొత్త ఉపా ధ్యాయులు వచ్చారు. కాని ఆ ఉపాధ్యాయులు గురువు జొహ్రాన్ వలె కారు. అందుకే కొందరు విద్యార్థులకు ఆ ఉ పాధ్యాయుని స్వభావం నచ్చలేదు. ఓ రోజు హసనుల్ బన్నా తన తండ్రితో ఇలా అన్నాడు.
“నాన్నగారు! ఇప్పుడు నేను ఈ పాఠశాలలోనే ఉండడం సరైందిగా అనిపించడం లేదు. మాడల్ స్కూల్ లో అడ్మిషన్ తీసుకోవాలని ఉంది”.
“హసన్! ఇంత వరకు నీవు దివ్యఖుర్ఆనన్ను అర్ధభాగం వరకే కంఠస్థం చేశావు. దివ్యఖుర్ఆనను సంపూర్ణంగా కంఠస్థం చేసిన తర్వాత నీ ఇష్టానుసారం ఏ పాఠశాల్లోనయినా వెళ్ళు” అని బదులిచ్చారు తండ్రి.
“తమరు సంతృప్తిగా ఉండండి నాన్నగారు! దివ్యఖుర్ఆన్ సంపూర్ణ కంఠస్థం నేను ఇంట్లోనే పూర్తి చేస్తాను.” అని బన్నా,
నాన్న గారికి మాటిస్తూ చెప్పాడు.
“అలాగే బన్నా! నీవు కంఠస్థం ఇంట్లోనే చేసుకుంటే, నాకెలాంటి అభ్యంతరం లేదు”.
ఈ సంభాషణ జరిగిన వారము లోపే హసనుల్ బన్నా మాడల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు బన్నా, అక్కడ కూడా రోజంతా పాఠశాలలోనే గడిపేవాడు. సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత ఇషా నమాజ్ వరకు తండ్రితోపాటు గడియారాల షాపులో పనిచేసేవాడు. ఇషా నమాజ్ నుండి నిద్రపోయే వరకు పాఠ్యాంశాలను కంఠస్థం చేసేవాడు. ఆ తర్వాత ఫజర్ నమాజ్ నుండి పాఠశాల వెళ్ళే వరకు దివ్యఖుర్ఆన్ కంఠస్థం చేసేవాడు.
చూశారా మీరూ…..? బన్నా తన నిజ జీవితాన్ని చిన్న నాటి నుండే ఎలా బిజీ షెడ్యూల్ గా చేవాడో! చిన్న వయసు అయినా తన తండ్రికి తోడుగా నిలబడ్డాడు. ప్రతి రోజు వేకువల జాములన లేచి దివ్యఖుర్ఆన్ కంఠస్థం చేసేవాడు
ఒక్కసారి ఆలోచించండి….! మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంత బావుంటుందో!
వేకువ సమయంలో మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్నైనా కంఠస్థం చేసుకోవచ్చు. కాని, నిబంధన ఏమిటంటే మన నిద్రపైన మనకు పట్టు ఉండాలి.



