Friday, November 27, 2026
spot_img

సిగ్గు చేటు!

సభ్య సమాజం తలదించుకునే సంఘటన మళ్ళీ సంభవించింది కొంతమంది కామాంధుల కిచక పర్వానికి భారత యువతి మీడియా సాక్షిగా బలై పోయింది. నిజంగా సిగ్గుచేటు!!

 

నడిరోడ్డు మీద మీడియా చూస్తుండ గానే ఇటీవల గౌహతిలో యువతిపై సామూహిక దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సందర్భంలో ఒక మీడియా ఉ న్నప్పటికీ సమాచారం మాత్రం ఆలస్యం గానే వెలుగుచూసింది. సమాచారం అందుకున్నాక ఒక వైపు మీడియా మరోవైపు స్త్రీ సంఘాలు, రాజకీయ నాయకులు సంఘటనపై సానుభూతి చూపించారు.

 

ఇటీవల అమ్మాయిలపై ఇలాంటి ఆకృత్యాలు జరగటం మరీ ఎక్కువై పోయింది. ఒక చోట చిన్నారి బాలిక హాస్టల్లో పక్క తడిపినందుకు శిక్షగా బాలిక తన మూత్రం తాగాలని బలవంతం చేసిన సంఘటన కూడా ఇటీవల వెలుగు చూసింది. ఇవన్ని ఏం సంకేతాలిస్తు న్నాయి? మన సమాజం ఎటుపోతుంది?? నాగరికత పేరుతో నైతికంగా అధపాతాళా నికి పయనిస్తోందనడానికి ఈ సంఘటనలే నిలువెత్తు సాక్ష్యాలు.

 

మనిషి ఆలోచనల్లో మార్పు రావాలని ఇంకెన్నాళ్ళు ఊకదంపుడు ప్రసంగాలు. చేద్దాం!! మార్పు ఆలోచనల్లో కాదు, ఆ రకమైన ఆలోచనలను ప్రేరేపిస్తున్న మాధ్యమాల నిర్వాహకుల్లో రావాలి. అంత కంటే ముందు సమాజానికి మూలమైన విద్యావ్యవస్థలో రావాలి. అంటే మన విద్యార్థులకు తమ పార్యశాంల్లో నైతిక విద్యను బోధించాలి. ఇలా సమాజంలో ఎన్ని మార్పులకు శ్రీకారం చుట్టినప్పుటికీ మనిషిలో నిజమైన దైవభీతి లేనంతకాలం సమాజంలో పరివర్తన సాధ్యం కాదు మినిషిలో దైవభీతి జనిస్తేనే జవాబుదారి తనం, బాధ్యతాభావాలు సమాజంలో పరిఢ విల్లుతాయి. సభ్యసమాజాన్ని కోరుకునే సమాజ శ్రేయోభిలాషులు ఇకనైనా ఇలాంటి సంఘటనల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వాటి మూలాలను అన్వేషించి శాశ్వత పరిష్కారం కనుగొనాలి. ఇన్ని జరుగుతున్నా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన చందంగా ‘స్లట్ వాక్’ నారీమణులు సమస్యను సహేతుకంగా అర్థం చేసు కుంటారో! లేక మరింత మంది యువతుల్ని ఈ సమస్యకు బలిపశువులుగా మారుస్తారో? కాలమే సమాధానం చెప్పాలి.

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles