Friday, November 27, 2026
spot_img

మార్చండి మన సిలబస్ను!

టి.వి. ఛానల్ మార్చినందుకు
తండ్రిని చంపిన తనయుడు
ప్రేమించలేదని యువతిని
కత్తితో నరికిన యువకుడు
బైకు కొనివ్వలేదని ఇంటికి
నిప్పంటించిన పెంపుడు కొడుకు
టీచర్ మందలించినందుకు
కలాశాలపై అంతస్తు నుండి దూకి
మరణించిన విద్యార్థిని
ఇది వార్తల క్రోడీకరణకాదు
పెళుసై పోతున్న మనో నిబ్బరాల వ్యధ
మానసిక దృఢత్వంలోని
మనుషుల విషాద గాధ
పనికిరాని సిలబస్
చదువుల పర్యవసానం
శాస్త్ర జ్ఞానం అభివృద్ధి చెందింది.
ఆలోచనల్లో అభివృద్ధి మాత్రం శూన్యం!
మనిషి ఎదుగుదలకు ఉపకరించలేని
ఆధునిక చదువులు ఎందుకు?
న్యాయం, ధర్మం, పరోపకారం
పెంపొందించలేని
విద్యావిధానాలు ఎందుకు?
వేలకోట్ల రూపాయల్ని ఖర్చుచేసి
యూనివర్శిటీ భవంతుల్ని నిర్మించారు.
కాని, మనిషిని, మనిషిగా నిలబెట్టే దిశగా
పరిశోధనలు చేపడుతున్నారా?
ముందు, ఆ దిశగా
మార్చండి మన సిలబస్లను.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles