ఒక్క సారి ఆయనను కలిసిన ఎవ్వరూ ఆయనను మరచిపోరూ….
నిరాడంబరమైన జీవితం, సత్సమాజ నిర్మాణం దిశవైపు తమ ఆలోచనలను ఆచరణాత్మకంగా తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణం, ఉన్నత విలువల స్థాపనకై అహర్నిశలు శ్రమించిన వ్యక్తి త్వం ఖాజీ హస్సన్ అహ్మద్ జమాతే ఇస్లామి పాకిస్తాన్ నాలుగు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికై గురుతర బాధ్యతలను నిర్వహించిన గొప్పవ్యక్తిత్వం. ఐకత్య సమిష్టి, సమానత్వం, సమైఖ్యత ఇవి వారి జీవితంలో ముఖ్యమైన అంశాలు. వీటి స్థాపన కొరకు నిరంతరం పాటుపడేవారు.
సమాజంలో నైతిక విలువల స్థాపనకు ఉద్యమాలను చేపట్టారు. మరియు ప్రజలను చైతన్య పరిచేవారు. మంచి చెడు మద్య బేధాన్ని విస్మరించిన మానవజాతికి (ప్రజలకి మంచి స్థాపన వల్ల కలిగే ప్రయోజనాలను మరియు చెడు వల్ల ఏర్పాడే వినశనాలను తెలియపరిచారు. మంచిని స్థాపించడానికి అనునిత్యం పోరాడేవారు. వీరి జీవితం నేటి యువకులకు ఆదర్శం వారు తమ చివరి దశవరకు కూడా “ఏ” నమాజమైతే మొద్దు నిద్రను వదిలి పోరాటపటిమను అలవరుచు కుంటుందో ఆ సమాజం విజయాన్ని సాధిస్తుంది. అని యువతరానికి సందేశమిచ్చారు. తన మాతృభాష పస్తూతో పాటు ఉర్దూ, ఇంగ్లీష్, అర బిక్, పర్షియన్ భాషలలో ఈయన ప్రావిణ్యులు.
ప్రస్థానం:
ఇస్లామీయ ఉద్యమంలో వీరి ప్రస్థానం, విద్యార్థి దశలో జమాఅతే తలబా పాకిస్తాన్లో 1970లో జమఅత్ సభ్యుడుగా ఉన్నారు. తర్వాత పేషావర్ విభాగం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తర్వాత కైబర్-పకతనిఖావా ప్రదేశానికి సెక్రటరీ తర్వాత అధ్యక్షులయ్యారు. 1978లో జమఅతే ఇస్లామి పాకిస్తాన్ జనరల్ సెక్రటరీగా తర్వాత 1987లో జమఅతే ఇస్లామి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
ఈయన 1938 జనవరి 12న నైషేర్ జిల్లా ఖైలార్ ఫక్తన్ఖావా గ్రా మంలో జన్మించారు. పాఠశాల రోజుల నుండే జమాతుల్ తల్బా విద్యార్థి సంస్థలో చురుకుగా పాల్గొనేవారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ లో ఇస్లామిక్ కాలేజ్ (యూనివర్శిటీ పేషవర్)నుండి పట్టా పొందారు. అక్కడే మూడు సంవత్స రాల పాటు ప్రొఫెసర్గా పనిచేశారు. విద్యార్థి దశ నుండే సామాజిక ఉద్యమాల వైపు ఆకర్షితులైన ఆయన, సమాజంలోని చెడులను రూపుమాపేందుకు గాను రాజకీయ ప్రవేశం చేసి 1980లో పాకిస్తాన్ పార్లమెంట్ కు ఎన్నికయ్యారు
ఆయన ఒకసారి చేసిన పరిచయ ఉద్యమంలో నాలుగున్నర మిలియన్ ప్రజలు ఉద్యమానికి దగ్గరై తమ పేర్లను నమోదు చేసుకున్నారంటే ఆయన పనితనం ఇట్టే కనబడుతుంది మౌలానా మౌదూదీగారి వ్యక్తిత్వం, రత నలు, ఆశయాలు, భావాలు, అల్లామా ఇన్బా గారి కవితలు తనను ఎంత గానో ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు.
వయసు తరిగిపోతుందన్న భావనతో ఆయన తను చేయవలసిన పని చాలా మిగిలివుందని పనిలో నిమ గృమవ్వటానికి ప్రయత్నిం చేవారు. ఎలాంటి ఉద్యమానికైనా యువకులే వెన్నెముక అని నమ్మేవారు అందుకే యువకులను ప్రోత్సహిం చేవారు. ఎదుటి వారిలోని బలహీ నతల కంటే వారిలో ఉన్న మంచి గుణాలను చూడాలని, మంచిని ప్రోత్స హిస్తూ బలహీనతలను తగ్గించాలని చెప్పే వారు.
బలవంతులు బలహీనులపై తమ ప్రతాపం చూపటాన్ని తీవ్రంగా ఖండిస్తూ బలహీనుల పక్షాన పోరా డేవారు. చెడులు ప్రభలినప్పుడు బాధపడుతూ కూర్చొకుండా వాటిని శాశ్వతంగా రూపుమాపేందుకు ప్రయ త్నించాలని పిలుపునిచ్చేవారు తాను స్వయంగా వాటికి వ్యతిరేకంగా పోరాడేవారు. ప్రసంగాల ద్వారా కార్యచరణ ద్వారా ఉద్యమంలో ముందుండి అనుచరులను నడిపించిన ఉద్యమ జ్యోతి 2019 జనవరి 6న తన చివరి శ్వాసను విడిచి భౌతికంగా దూరమై చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు.



