Friday, November 27, 2026
spot_img

బడి బువ్వ…హవ్వ!

దేశ భవితను తీర్చిదిద్దేది బాలలే. అలాంటి  బాలల భవిష్యత్తు ఛిద్రమవుతోంది. ఉచిత విద్య నాణ్యమైన విద్య, ఆహారం సమకూర్చాల్సిన ప్రభుత్వం అన్ని విధాలా విఫలమవుతోంది. విద్యా హక్కు, సర్వశిక్షా అభియాన్, రాజీవ్ విద్యా మిషన్ వంటి అనేక ప్రాజెక్టులు, హక్కులు వున్నా గాని నాణ్యమైన విద్య నేటికీ అలంకార ప్రాయం గానే వున్నాయి. అలాగని కనీసం పౌష్టికాలు కల్పించే నాణ్యమైన ఆహారాన్ని ప్రభుత్వం అందించలేకపోతుంది. బడికి వచ్చే పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం 2003 లో ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రాథమిక స్థాయి నుండి 10వ తరగతి వరకు విస్తరిస్తూ 2011లో ప్రభుత్వ నిర్ణయించింది. మంచి నాణ్యమైన, పౌష్టికమైన ఆహారం అందించాల్సిన ఈ పథకం, పురుగుపట్టిన, దుడ్డు బియ్యం , నీళ్ళ చారుతో నీరుగారుతుంది. నాసిరకమైన నాణ్యతా లోపంతో శక్తివంతమైన భారతావని నిర్మాణం ఎలా సాధ్యం. మొన్న బీహార్లోని చాప్రా బడిలో విషాహారం తిని మరణించిన పాతిక మంది పిల్లలతో పాఠశాల ప్రాంగణం శ్మశాన వాటికగా మారింది. ఈ సంఘటన తరువాత వరుసగా తమిళనాడులోని నెవేలి, ఒడిశా, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాలలోను ఇటువంటి సంఘట నలు పునరావృతమయ్యాయి. ప్రభుత్వ మధ్యాహ్న భోజనం పసి ప్రాణాల పాలిటి యమ పాశాలుగా మారాయి. కేంద్ర ప్రభుత్వం 2013 14లో ఈ పథకానికి 13,215 కోట్లు కేటాయించింది. ఈ పథకం 75: 25 నిష్పత్తిలో కేంద్ర,

రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. కాని ఇన్ని నిధులు వుండి కూడా నాసిరకమైన ఆహారం కల్పించడంతోపాటు గోదాము నుండి నేరుగా పాఠశాలలకు చేరాల్సిన సరుకు ఇతర చోట్ల చేరడం, అనేక అక్రమాలకు తెరలేపుతుంది. గతంలో దాదాపు 400 క్వింటాళ్ళ బియ్యం కోల్ కతా ప్రభుత్వం పశు దాణాగా అమ్మేసింది. మరోచోట వేరే ప్రాంతానికి తరలిస్తున్న ఎనిమిది ట్రక్కులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అంటే ఈ నిధులు విధిలో వున్న అధికార యంత్రాంగం పొట్టలో పోగా చిన్నారుల పొట్టలో పురుగుల ఆహారం పోతుదంటే మన పాలకుల దుస్థితి గుర్తిం చాలి. ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని, దాదాపు పది కోట్ల మంది బడి పిల్లలకు పోషకాహారం కల్పిస్తున్నామని చెప్పుకోవడానికే గాని పథకం అమలు వాస్తవాలకు అతీతంగా వుంది. చివరికి ప్రభుత్వ “ఉచిత మధ్యాహ్న భోజన పథకం” మథ్యాహ్న భోజనంగా మారింది.

 

అలాగే వంటగదులు, ప్రహరీ గోడలు, త్రాగునీరు పైకప్పు, వంటి మౌలిక వసతులు లేకపోవటంతో కలుషితాహారం కంచంలో పడుతుంది. ప్రతి జిల్లాకు వంటగది నిర్మాణం కోసం రూ.9 కోట్లు కేటాయించింది. అయినా నేటికీ ఇది అమలుకు నోచుకోని పరిస్థితి. బడుగు బలహీన వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రభుత్వ శ్రద్దాసక్తులు కనబడకపోవటంతో ఎంతో మంది బాలలు బలై పోవటం ఒక విధంగా విద్యా రంగంలో సామాజిక అసమానతే.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles