ఒకింట్లో యజమాని జిహ్వ చాపల్యం చంపుకోలేక భార్య దగ్గర రుచికర వంట కాలకోసం ప్రతిరోజూ సతాయిస్తూ ఉండే వాడట. పాపం ఆ ఇల్లాలికి పెద్దగా వంటరాదు. భర్తకు నచ్చేలా వండడం కోసం ఎప్పటికి కప్పుడు తిప్పలు పడుతుండేది . ఒకరోజు పొరుగింటి నుండి కూరవచ్చింది. మొత్తం భర్తకే పెట్టింది. చూడు పక్కింటి పిన్నిగారు ఎలా చేశారో… వంటంటే ఇది… ఇకనైనా ఇలా చెయ్యడం నేర్చుకో… అరే శుద్ధంగా వండటం కూడా రాకుంటే ఎలా? అసహనాన్ని దెప్పు మాట లతో వెళ్ళగక్కాడు. ఆ ఇంటావిడకు కూడా పంతం పెరిగింది. ఇదే వంట రేపు పక్కింటావిడలాగే చేస్తా చూడమంది. తీరా మరునాటి మధ్యాహ్నం వంటింట్లో భార్యను చూసి తిండిబోతు భర్త అవాక్కయ్యాడు. పక్కింటి పిన్నిగారు పెద్దావిడ. పైగా భర్త కాలం చేశాడు. వారి ఆచారం ప్రకారం ఆమె గుండు గీయించుకుని తెల్ల చీరతో జీవనం సాగిస్తుంటుంది. ఆమెను చూసి ఈమె… పిన్ని గారిలా వంట చేస్తోం దన్న మాట. సరిగ్గా మన విద్యా విధానం ఇలాగే లేదూ…
పాశ్చాత్య దేశాల్లో మనకంటే మెరుగైన అభివృద్ధి ఉంది. పాశ్చాత్య దేశాల్లో చదువు అత్యాధునికమైంది.. పాశ్చాత్య దేశాల్లో పని సంస్కృతి ఎక్కువ. పాశ్చాత్య దేశాల్లో శాస్త్ర విజ్ఞాన పరిధి విస్తృతం. పాశ్చాత్య దేశాల్లో జీవనమే వేరు. అక్కడ తినడం కూడా ఒక కళే… ప్రతి దాన్ని పాశ్చాత్య దేశ అద్దాల్లోంచి చూడడానికి అలవాటు పడ్డాం. జీవనం, సంస్కృతి, నాగరికత, అభివృద్ధి ఆయా దేశ, కాల, పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నది నూటికి నూరుపాళ్ళ నిజం. మన అవస రాలను మనం గమనించుకో వాలన్నా, అధ్యయన, సమీక్షలు చెయ్యా లన్నా… ఒక కమిటీ ఏర్పడి కొన్ని దేశాలు తిరిగి… కొన్ని కోట్లు వెచ్చించి నిగ్గు తేల్చడం ఒక విధా తయారు చేసుకున్నాం. నిజంగా అభివృద్ధి కోసం విశ్వవీక్షణం అవసరమే. కొన్ని విధానాల అవసరం, అమలు, అవధి విషయంలో సమగ్ర పరిశీలన పరిమి తుల సమీక్ష… పర్యవసానాల బాధ్యత చాలా జాగ్రత్తగా గమనించాలి. విద్యా విషయానికే వద్దాం. అక్కడ మనలా యాంత్రీకరణ లేదు… నిర్బంధం లేదు. ఐచ్ఛికతతో కూడిన గుణాత్మకత అక్కడి విధానం. అక్కడ పరిశోధన స్థాయి అధ్యా పకులు పాఠశాల విద్యా స్థాయికే మార్గ దర్శకులుగా వ్యవహరిస్తుంటారు. అక్కడి వాతావరణం. విధానం… అవసరాలు… టెక్నాలజీ… పుస్తకాలు మనలా మొయ్య నక్కరలేదు. అతి విశాల అత్యున్నత విద్యా వనరులు కల్పించడం ద్వారా స్వీయ అధ్య యన, శోధనలకు పాదులు వేస్తూ సంబం ధిత జ్ఞానాన్ని ఆకళింపు చేసుకునే స్థితిని కల్పించడం ఉన్నత స్థితిలోని పాశ్చాత్య దేశీయుల విద్యా విధానం.
మనం మాత్రం పాఠశాలల్ని కేవలం గణాంకాల కోసం నిర్వహిస్తున్నాం. కళాశాలల్ని ఎప్పుడో గాలికొదిలేశాం. ఇక విశ్వవిద్యాలయాల్ని … వాటి నాణ్యతల్ని ‘డిస్టెంన్స్’ఉంచేశాం. టెక్నాలజీ పదాన్ని మాత్రం పూర్తిగా అర్థంకాకపోయినా గట్టిగా పట్టుకున్నాం. నగరాలను, వర్శిటీలను, కళాశాలలను, స్కూళ్ళను వీలైతే అంగన్ వాడీలను ‘వైఫై’ సెంటర్లుగా మార్చి టెక్నా లజీని పిల్లల ఒళ్లో కుమ్మరించాలను కుంటున్నాం. 10వ తరగతి మొదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ఆండ్రాయిట్ ఫోన్లు, ఐపాడ్లు, నోట్పాడ్లు చేతపట్టి 80 శాతం మంది దాదాపు రోజుకు కొన్ని గంటలపాటు అశ్లీల సైట్లు చూస్తూ గడుపు తున్నారని దాదాపు అన్ని మాధ్యమాల సర్వేలు ఘోషిస్తున్నాయి.
ఒక పాఠశాలలోనైతే హెడ్మాస్టర్కు ముచ్చె మటలు పట్టాయి. అతని సెల్ఫోన్కు వరుసగా మెసీజీలు. కొన్ని రోజులుగా తన ప్రతి కదలికపై నిఘా. ఎవ్వరితో చెప్పుకోలేక అసలు తనకు శత్రువులెవరో అర్థం కాక పాపం అతను ఎంత వేదన పడ్డాడో.. వేసుకున్న డ్రస్సుల నుండి ప్రతి కదలిక మీదా కామెంట్, అసభ్య పదజాలం… సహచర అధ్యాపకులా… పిల్లలా… బైట వారా…. అసలు ఎందుకిలా వెంటపడు తున్నారు. సిబ్బందితో చెబుదామంటే వారికీ అభద్రతాభావం, భయం కలుగు తాయనే సంశయం. వారం వేదన తర్వాత పరిశోధన ఫలించి పాఠశాలలోనే సెల్ ఫోన్లను కొందరు పిల్లను పట్టుకోగలిగారు. కేసు ఖాకీల వరకు వెళ్ళింది. పిల్లలు జవాబుకు అందరూ విస్తుపోయారు. కేవలం ‘కిక్కు’ కోసమే అలా చేశామని పిల్లల ముక్తాయింపు. పాఠశాల స్థాయి పిల్లలు సరదా కోసం ప్రధానోపాధ్యాయుణ్ణి పరుగెత్తించారంటే నవీన విద్యలో లోపి స్తోందో చెప్పనక్కరలేదు.
కళాశాల స్థాయిలో పాఠాల సమయంలోనో విరామ సమయాల్లోనో వయోవాంఛలకు లోనై అసాంఘిక దృశ్యాల వీక్షణకు అలవాటు పడి తద్వారా ప్రేరేపితమైన భావోద్రేకం కారణంగా తెరపైకి వస్తున్న వేలాది మరుగుపడిపోతున్న లక్షలాది బలైపోతున్న వందలాది ఘటనలు ప్రతి పేపర్లో కనిపించే పతాక శీర్షికలు. హైలింక్డ్ యీన్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఆర్ కూట్, వాట్సాప్, స్కైప్, ఇస్ట్రాగ్రామ్, గూగుల్షస్ కుప్పలు తిప్పలుగా సోషల్ నెట్వర్క్. ఎవరోకరి ఫోటో, ఏదోక ప్రూఫ్, చాలా చీప్ ఆఫర్లసిమ్. అసలే కోతి ఆపై కల్లు. యువతరం ఎంత విచ్చలవిడిగా, విశృంఖ లంగా తయారవుతుందో అందరికీ తెలుసు. ప్రతి వారికీ తమ బిడ్డలు బంగారమే.
సర్వసత్తాక గణతంత్ర అగ్రప్రజాస్వామ్య దేశమైన మన నేలలో ఎవ్వరు తప్పు చేసినా ఎవ్వరూ ప్రశ్నించరాదు. చట్ట ప్రకారం ఎవరైనా ఫిర్యాదు చెయ్యాలి. ఆ ఫిర్యాదుకు సాక్షముండాలి. దాన్ని ఇంకె వరైనా ధృవీకరించాలి. తప్పిదం చేసిన వారికి కులబలంగాని, ధనబలంగానీ, రాజకీయ బలంగా లేకపోతే సెక్షన్ల ప్రకారం శిక్షపడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో అమాయకుల్ని రక్షించే పనిలోనే తరించే సంఘాలు వాటి ఉనికి కోసం జెండాలు పడితే క్షమించి వదలి వెయ్యవచ్చు. ఎవరేం తప్పు చేసినా దాన్ని విద్యతో ముడిపెట్టి అర్థరహితంగా ఉపాధ్యా యుల్ని తప్పు పడతారు.
అసలు విద్యాలయాలకు ఫోన్లు అనుమ తించడమెందరకు. అత్యవసరమైతే ఆయా సంస్థల్లో, ‘రిసిప్షన్ ఫోన్ ఉంచాలని నిబంధన పెట్టవచ్చు. విద్యా సంస్థలకు విజ్ఞానపరంగా అంతర్జాలం తప్పనిసరి చేసి కంప్యూటర్ విభాగంలో పిల్లలకు నిరం తరం అందుబాటులో ఉంచొచ్చు. పరిశీ లకులు యే సిస్టం మీద ఎవరు ఏ పని చేస్తున్నారో పరిశీలించేందుకు వీలవడమే కాక తప్పిదాల నివారణకు, వ్యవస్థ నడవడిని మెరుగుపరచేందుకు విద్యారంగ వ్యక్తులు బాసలుగా నిలవొచ్చు. నేరం విచారణ సమయంలో పోలీస్ స్టేషన్ల దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు అమాయకంగా నిలబడి “చిన్నప్పటి నుండి మావాడు అలాంటోడు కాదయ్యా… ఇదిగో ఈ స్కూల్లోనో, కాలేజీలోనే చేర్చాం. మీ దగ్గర తలొంచుకొని నిల్చున్నాం. అని చెప్పడం రివాజుగా టీవీల్లో చూస్తున్నాం. నిజానికి తప్పిదం ఎక్కడ జరుగుతోంది అనే విష యాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసర మున్నది.
మానవతవైపు, సమత వైపు, శాంతివైపు, కృషి వైపు నడిపించాల్సిన విద్యా వ్యవస్థలో విష సంస్కరణలెందుకు? ఒక ఇంజ నీరింగ్ కళాశాలలో నిశ్శబ్దంగా పిల్లలు కూర్చొని ఉన్నారు. ఆచార్యుడు బోర్డువద్ద లీనమై పాఠం చెబుతూ ఒక్కదుటన పిల్లలు చేసిన కేరింతలతో గుండెపట్టు కున్నాడు. కాలేజీలో వైఫై ఉంది. అప్పటి దాకా క్రికెట్ ఉత్కంఠ. అందుకే తగరతి గదిలో నిశ్శబ్దం. అందరూ సెల్ఫోన్లలో ఆట చూస్తూ అభిమాన టీం గెలవగానే హల్చల్ చేశారు. ఆచార్యులకు గుండె పోటురాక ఏమవుతుంది? వివిధ సందర్భా లలో అమ్మాయిల ఫోటోలు తియ్యడం గ్రాఫిక్స్ పాడుచేసి మిత్రులకు షేర్ చెయ్యడం. పిల్లలు తల్లికి కూడా చెప్పలేక నలిగిపోయే దాష్టీక సంఘటనలెన్నో. ఇటీ వలే సోషల్ మీడియా హైక్ మాద్యమం “బాక్ బెంచర్స్” అంటూ ప్రమోషన్ సీన్ చేసింది. కుర్రకారు ఆచార్యులను ఎలా ఏడిపించొచ్చో సులభంగా నేర్పించే ప్రయత్నం అది. సారాంశం ఏమిటంటే హైక్ ద్వారా నెట్ లేకుండానే “హెచ్.డి. మూవీలు” షేర్ చేసుకోవచ్చట. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు రావడమంటే ఇంతే కదూ… నెట్ వర్క్ గొప్పతనం కోసం ఆచార్యులు స్థితిని అధోగతి చెయ్యాలా…
అసలే ఉన్నత విద్య ఉనికి, ఆదరణ ప్రశ్నా ర్థకంగా ఉంటే మన అతి స్వేచ్ఛను… పర్యవసానాలను నియంత్రించేదెలా?
పూర్తిగా ప్రయివేటు హస్తాలలో ఇంటింటికీ అదే పనిగా తిరిగి బ్రతిమాలి… స్వాగతించి… సాగబీకే కళాశాల వ్యవస్థ తప్పుల్ని ఎలా కట్టడి చేస్తుంది. యే నిబంధనల ప్రకారం ఫోన్లను నిషేధిస్తుంది. పూర్తి బరితెగించినా కూడా కరెన్సీ నోట్ల రక్షణ వలయాల్లో కళాశాలల కుర్రకారు సరదాలను ఆస్వాదిస్తూనే ఉన్నారు.. కాసుల కక్కుర్తిలో యాజమాన్యాలు సైతం క్రమశిక్షణా చర్యలకు స్వస్థి చెబుతున్నారు. పేదవాడి కడుపు నింపకపోయినా, చదివని వారికి ఉపాధి చూపలేకపోయినా, ధర లను అదుపులో ఉంచకపోయినా… కరువు కాటకాలను ఛేదించలేకపోయినా సంస్కారం… మావనతలను ప్రతిష్టింపలేక పోయినా ప్రతి పుర్రెకూ ఒక సెల్లు అంట కట్టగలిగామంటే మన వైజ్ఞానిక ప్రపంచ ప్రచార ప్రభజంనం పూర్తి ఫలితాలు సాధించినట్టే అర్థం చేసుకోవచ్చే. విద్యలో ఇంకా కొత్త పోకడలు ఆహ్వానించి కొన్ని పాశ్చాత్య దేశాల్లో లాగా ఆత్మ రక్షణకోసం స్కూలు పిల్లలకు పెన్నులతోపాటు గన్నులు కొనివ్వడమా… మనసు పెట్టి సంస్క రించి విద్యాలయాలకు సెల్ఫోన్లతో అనుమతిని నిషేదించడం, అశ్లీల వెబ్సైట్ లను నిర్మూలించడం ద్వారా యువత పెడత్రోవ పెట్టకుండా కాపుకాయడమా… ఇదే సంస్కరణల సమయం ఉపేక్షించడం అత్యంత ప్రమాదకరం.



