మనిషి సంఘజీవి. ప్రతి విషయాన్నీ ఇతరులతో పోల్చుకోవడం, వాటిని సాధించాలను కోవడం… మనుష్యల్లో సాధారణంగా ఉండే అలవాటు వీటిని సాధించడానికి సరైన ప్రణాళిక సంకల్పం కావాలి సంకల్ప మనేది మనిషి యొక్క జీవన ప్రవాహమునే మార్చివేసేటంత తీవ్రముగా ప్రభావ వంతముగా ఉంటుంది. అది జీవన క్రియను తారుమారు చేసేస్తుంది.
ఒక వ్యక్తి “సిగరెట్ త్రాగడము మానేస్తాను” “మందు త్రాగడము మానే స్తాను” అనుకుంటాడు. కానీ ఎక్కువ కాలము ఆ మాట మీద నిలబడలేక ఏదో ఒక రోజు….సిగరెట్ తాగుతాడు.. మందు త్రాగుతాడు. అలాంటి దాన్ని “సంక ల్పము” అని అనలేము. ఎందుకంటే… అది కేవలం “కల్పన” సంకల్పమంటే మనిషి లోని నరనరమూ తనకు తాను ఆ సంకల్పమునకు అనుగుణముగా మలుచుకుంటూ. నడిపిస్తూ ఉంటుంది.
రోజుకు 24 గంటలలో 25 నిమి షాల సేపు (అంటే… ఐదు పూటలా నమాజ్ చేయ్యడానికి పట్టే కాలము) మాకు మనస్సు లగ్నము కావటం లేదు.. పనిలో తీరిక లేదు.. “సమయము దొరకడం లేదు…. అని కొందరు అంటూ ఉంటారు. మరి భోజనము చేయ్యటానికి, టీ త్రాగటానికి లగ్నము అవుతుందే..
సమయము దొరుకుతుందే…! మరి నమాజ్లో ఎందుకు లగ్నము కాదు? ఎందుకు సమయము దొరకుదు? అంటే. మనకు అందులో సకంల్పము లేదని అర్థం. విశ్వానికి జీవం పోసిన దైవంపై విశ్వాసం ఉంచడం మన ప్రధమ కర్తవ్యం సదాచారం సత్ సంకల్పం సచ్చీలత ఇవన్నీ కూడా విశ్వాసంలో భాగాలే.
ఏ విధంగా నైతే.. పచ్చగా కళ కళ లాడే వృక్షం ఎలాగైతే పూలు, ఫలాలని స్తుందో అలాగే సదాచరణలు సదలవాట్లు సత్ సంకల్పాలు సచ్చీలతలు కూడా విశ్వాస శాఖలే కాకుండా.. అవి మనకు మంచి ఫలితాలనిస్తాయి. మనస్సును నియంత్రించ గలిగే ప్రక్రియ నమాజ్ లో సంకల్పము, నిష్ట, సాహసము, సిద్ధాంతం, ఆదర్శం మొదలైన అంశములన్నీ బోధిం పబడి ఉంటాయి. శ్రేష్టమైన ఆలోచనలు ఆదర్శ పూరిత మైన ఆలోచనలు, సంకల్ప యుక్తమైన సరియైన ఆలోచనలు నమాజ్ ద్వారానే ప్రాప్తమవుతుంది మహానీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ఈ విధంగా సెలవిచ్చా రని హజ్రత్ ఉమర్ (రజి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు. కర్మలు కేవలం మనోసంకల్పం పై ఆధారపడి ఉంటాయి మనిషి దేని సంకల్ప మయితే చేసుకుం టాడో.. అతనికి అదే ప్రాప్తమవుతుంది. (ముత్తఫకున్ అలైహ్)
అదే హదీసులో దైవప్రవక్త (సఅసం) ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ.. ఎవరయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం హిజ్రత్ చేస్తారో వారి హిజ్రత్ మాత్రమే నిజమయినది. ఎవరయితే ప్రాపంచిక సిరి సంపదలకోసం లేదా ఒక స్త్రీతో వివాహ మాడటానికి హిజ్రత్ చేస్తారో వారి హిజ్రత్ ప్రపంచం కోసమో లేక ఒక స్త్రీ కోసమో చేసిన హిప్రజగా పరిగణించబడుతుంది అని సెలవిచ్చారు.
మహా ప్రవక్త (స||సం) ఉపదేశానికి భావమేమంటే… సత్కార్యాలు సఫలీకృత మవడం మనిషి చిత్తవైఖరిపై ఆధారపడి ఉంటుంది. సంకల్పం సవ్యంగా ఉంటే.. పుణ్యఫలం లభిస్తుంది లేకపోతే లేదు. ఒక వేళ హిజ్రత్ (ఓ గొప్ప ఆరాధన, పుణ్యకార్యము) చేసే టప్పుడు సయితం సంకల్పంలో ఏదయినా చెడు ఉద్దేశ్యం కలిగితే.. దానికి ఎలాంటి విలువా ఉండదు. ఒక కార్యం పైకి ఎంత గొప్ప సత్కార్యంగా కనిపించినా పరలోకంలో దాని ప్రతిఫలం లభించా లంటే… దాన్ని దైవ ప్రసన్నత పొందటా నికి మాత్రమే చెయ్యాలి. ఒక వేళ దాన్ని ప్రాపంచిక లాభం పొందడానికి మాత్రమే చేస్తే…. పరలోకంలో దానికి ఎలాంటి విలువా లభ్యం కాదు. ఈ సత్కార్యం అక్కడ చెల్లని నాణెం అవుతుంది ఉదాహర ణకు ఇద్దరు వ్యక్తులు ఒకే విధమైన సత్కార్యం చేస్తున్నారనుకోండి అంటే.. ఇరువురూ చెరోక బావిని తవ్వించారు వారు చేసిన పనికి ఒకతానికి మాత్రమే పరలోకంలో సత్పలితం లభిస్తే రెండవ దానికి ఏమీ అభించలేదు. ఎందుకంటే… పరలోకంలో మనిషికి లభించే ప్రతిఫలం అతని సంకల్పంపై ఆధారపడి ఉంటుంది సంకల్పం బాగుంటే అతనికి తన సత్కార్మల పుణ్యఫలం లభిస్తుంది. ప్రతి సత్కార్యం వెనుక దైవప్రీతికి బదులుగా వేరే ఉద్దేశ్యం ఉంటే… పరలోకంలో దానికి ఎలాంటి విలువ ఉండదు. ఒక వ్యక్తి కేవలం పేరు ప్రతిష్టల కోసమని తనను అందరూ మంచి వాడిగా భావిం చాలని “బావి”ని తవ్విస్తే… పరలోకంలో అతను చేసిన ఆ పనికి ప్రతిఫలం లభించదు. అయితే.. మరోక వ్యక్తి దైవం తనకు సిరిసంపదలు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా “బావి”ని తవ్వించడమే కాక తన ప్రభువు సంతోషించాలని కోరుకుంటూ.. ఈ బావి వల్ల కొంత కాలం
“ఎవరయితే… రమజాన్ నెల రాత్రుళ్ళలో సంకల్పం శుద్ధితో అల్లాహ్ నుండి పుణ్యఫలం సంపాదించడానికి నమాజ్ చేస్తాడో… అతని అపరాధాలను ఆయన క్షమిస్తాడు” అని ప్రవక్త (స||అసం) అన్నారు. ప్రాపంచిక ప్రలోభానికి లోను కాకుండా కేవలం దైవ ప్రీతికోసం దైవ మార్గంలో ఖర్చు పెట్టగలగాలి.
వరకు ప్రజలు ప్రయోజనం పొందాలని ఆశిస్తాడు. తత్ఫలితంగా అతనికి పర లోకంలో దాని ప్రతిఫలం తప్పని సరిగా దొరుకుతుంది. ఎన్ని సత్కార్యాలు చేసినా…. మనకు సంకల్ప శుద్ధి లేకపోతే మనం చేసినదంతా వృధాయే అవుతుంది
“ఎవరయితే… రమజాన్ నెల రాత్రుళ్ళలో సంకల్ప శుద్ధితో అల్లాహ్ నుండి పుణ్యఫలం సంపాదించడానికి నమాజ్ చేస్తాడో… అతని అపరాధాలను ఆయన క్షమిస్తాడు” అని మహాప్రవక్త (స||||సం) అన్నారు. ప్రాపంచిక ప్రలోభానికిలోను కాకుండా కేవలం దైవ ప్రీతికోసం దైవమార్గంలో ఖర్చు పెట్టగల గాలి. అయితే పేరు, ప్రతిష్టల కోసం డబ్బు ఖర్చు పెట్టేవారు దైవప్రీతిని ఎన్నటికీ పొందలేరు. కాకపోతే దైవ మార్గంలో డబ్బు ఖర్చు పెట్టడంలో మన ప్రయో జనం కూడా ఎంతో కొంత ఇమిడిఉంది. దీనివల్ల పరలోకంలో మనం అల్లాహ్ అనుగ్రహానికి అర్హులవడమే కాక, ఇహలోకంలో మనలో ఉన్నత సుగుణాలు జనిస్తాయి. కాబట్టే ఈ విధమైన సంకల్ప శుద్ధితో కూడిన సత్కార్యం మనకు ఉభయ
లోకాల్లోనూ లాభం చేకూర్చుతుంది. అదే సంకల్ప శుద్ధి లోపించన సత్కార్యమయితే ఐహిక జీవితం లో కొంత లాభాన్ని కలిగిస్తే కలిగించవచ్చు కానీ పరలోక జీవితంలో మాత్రం దాని దుష్ప్రభావన్ని చవి చూడ వలసి వస్తుంది.
మన సృష్టికర్త మానవాళికి ప్రసాదించిన మహా భాగ్యాల్లో అత్యున్నత మయిన మహాభాగ్యం పవిత్ర నెల రమజాన్ మాసం. ఈ పండుగ శుభసంద ర్భంగా దృఢసంకల్పం చేసుకుంటే.. ఆరోజు నిజమైన పండుగ దినమే. ఎలాగంటే ఈ పవిత్ర మాసంలో నయినా మనం అజ్ఞానాంధకారంలో కూడిన పాత జీవితాన్ని వదలి దైవ హితవులతో నిండిన కొత్త జీవితాన్ని ప్రారంభిం చడానికి సంకల్పం చేసుకోవాలి. ఇక నుండి ఎప్పటికీ దైవాదేశాల ప్రకారమే జీవితం గడుపుతామని దైవానికి ఆగ్రహం కలిగే పనుల జోలికి పోమని నిర్ణయించు కోవాలి. మనోవాంఛలకు, మిధ్యా దేవుళ్ళకు పూర్తిగా స్వస్తి చెప్పి… కేవలం ఏకైక దైవానినే దాసులయి ఉండాలి అప్పుడే మన జీవితంలో ఆనందోత్స వాలు వెల్లివిరిసే అత్యంత శుభదినం అవుతుంది. నేటి సమాజంలోని చెడు లను ఎరుర్కొని పోరాడడానికి నైతిక బలాన్ని సమకూర్చుకోవాలి. దుర్మార్గం దౌర్జన్యం, మద్యపానం, వడ్డీ, జూదం.
మొదలగు అవినీతి దుర్మార్గాలను ఎదుర్కోవడానికి బ్రహ్మండమైన సంకల్ప శక్తిని పెంపొందించుకోవాలి. ఇహపరా లలో సాఫల్యం కావాలనుకుంటే చెడు పనులు, అంటే మధ్యపానం వ్యభిచారం జూదం మొదలగు వాటి దరిదాపులకు కూడా వెళ్ళకండి. ఒక వేళ ఎప్పుడయినా, అలాంటి కోరికలు మీమదిలో కలిగితే… హృదయంపై చెయ్యి పెట్టి పూర్తి విశ్వా సంతో గట్టిగా సంకల్పం చేసుకోండి.



