నేడు అంతర్జాలంలో పెరిగిపోతున్న సమస్యలు వాటి నుండి విద్యార్ధులను ఏ విధంగా రక్షించాలనే ఉద్దేశంతో విసతీపత్రాన్ని పోలీస్ ఉన్నతాధికారికి అందించారు. అంతర్జాలం నుండి అశ్లీలాన్ని రూపుమాపడానికి, అశ్లీల వెబ్సైట్లు తొలగించడానికి, అంతర్జాలంలో నేరాలను నియంత్రించడానికి పోలీస్ అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా · ఎస్ఐఓ బాధ్యులు కోరారు.
ఎస్ఐఓలో చేరుదాం సమాజాన్ని పునర్నిర్మిద్దాం…
ఎస్ఎస్ఐఓలో చేరుదాం సమాజాన్ని పునర్నిర్మిద్దాం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారం రోజుల పరిచయ ఉద్యమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు, విద్యారంగంలో వస్తున్న మార్పులు సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర క్రియాశీలంగా ఉండాలని ఆంధ్రరాష్ట్ర అధ్యక్షులు కరీముద్దీన్ తెలిపారు. విద్యార్థులు సమాజ మరియు విద్యాలయాలలో ఉన్నటువంటి సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి కంకణం కట్టుకోవాలి. ఈ సందర్భంగా విద్యార్థులు ఎస్ఐఓలో చేరి సామాజికాభివృద్ధికి, విద్యా వ్యవస్థలో నైతిక పరివర్తన తేవడానికి పాటుపడాలనని పేర్కొన్నారు.
కర్నూల్లో… ఎస్ఐఓ సమాజంలో యువతకు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, విలువలను, సమసమాజ నిర్మాణానికై ప్రతి విద్యార్థి తోడ్పడే విధంగా ప్రోత్సహిస్తుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఎస్ఐఓ నిర్వహిస్తుందని కర్నూల్ బాధ్యులు తెలియజేశారు.
ఇంటర్ నెంట్లో అశ్లీలాన్ని తరిమేద్దాం…
తెలంగాణ రాష్ట్ర క్యాంపస్ సెక్రటరీ -ఉమర్
ఈ ఎథిక్స్ క్యాంప్యాయిన్ సందర్భంగా విద్యార్థులకు నైతిక ప్రమాణాలను పెంపొందించడానికి చైతన్య పరుస్తున్న | తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కార్యదర్శి ఉమర్ తెలిపిన వివరాలు విద్యాలయాలలో రోజురోజుకం పెరిగిపోతున్న ర్యాగింగ్ సమస్య, విద్యార్థుల వ్యవహారశైలిలో వస్తున్న మార్పులు తద్వారా వారిలో అనేక రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి. చదువుతోపాటు, విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో ఇలాంటి
| రుగ్మతలను రూపుమాపుతూతాము నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవటానికి అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు.



