స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర స్థానిక బాధ్యుల సమావేశం వరంగల్లో నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ మలిక్ షారిఖ్ గారు మాట్లాడుతూ సంస్థ తన ప్రాథమిక కర్తవ్యంగా విద్యా విధానంలో నైతిక వరవడిని విద్యాలయాలు మరియు విద్యార్థులను సామాజిక పరివర్తనకు నాందిగా తీర్చిదిద్దడానికి ఎస్.ఐ.ఓ. కృష్టి చేస్తుంది. తెలిపారు. అన్ని రకాల అతివాదాలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకు శాంతి, సౌభ్రాతృత్వాల భావన గల సమాజాన్ని నిర్మించేందుకు సంస్థ నిర్విరామకృషి చేస్తుందని తెలిపారు. ఇస్లామ్ సందేశాన్ని వ్యాప్తిచేయడం మరియు ఇస్లాంపై ఉన్న అపోహలను రూపుమాపడం, విద్యాభ్యున్నతి కొరకు పాటుపడుతూ విద్యార్థులను కేవలం డబ్బు సంపాదించే యంత్రాలుగానే కాకుండా సమాజాభివృద్ధి కొరకు పాటుపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సలహా మండలి రూపొందించిన సంస్థ పాలసీ ప్రోగ్రామ్ను వివరించటం జరిగింది. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అబ్రార్ అలీ, ఆర్గనైజింగ్ కార్యదర్శి కలీం అహ్మద్ ఖాన్, దావా కార్యదర్శి అబ్దుల్ హన్నాన్, క్యాపంస్ కార్యదర్శి ముహమ్మద్ ఉమర్, రాష్ట్రం నలుమూలల నుండి స్థానిక బాధ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక బాధ్యుల సమావేశం
స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక బాధ్యుల సమావేశం నెల్లూరులో నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ పౌర సంబంధాల కార్యదర్శి లయీఖ్ అహ్మద్ ఖాన్ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సలహా మండలి రూపొందించిన సంస్థ పాలసీ ప్రోగ్రామ్ను వివరించటం జరిగింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి. కరీముద్దీన్ గారు మాట్లాడుతూ సంస్థ విద్యా విధానంలో నైతిక మార్పును తీసుకు రావాలని విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాదులని, వారు నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే విద్యా వ్యవస్థ బాగుపడుతుందని దీనికోసం ఎస్.ఐ.ఓ. నిరంతరం కృష్టి చేస్తుందని తెలిపారు. ఇస్లామ్ సందేశాన్ని వ్యాప్తిచేయడం మరియు ఇస్లాంపై ఉన్న అపోహలను రూపుమాపడం, విద్యాభ్యున్నతి కొరకు పాటుపడుతూ విద్యార్థులను కేవలం డబ్బు సంపాదించే యంత్రాలు గానే కాకుండా సమాజాభివృద్ధి కొరకు పాటుపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రహ్మాన్ సూఫీ, ఆర్గనైజింగ్ కార్యదర్శి సాధిఖ్ మరియు రాష్ట్రం నలుమూలల నుండి స్థానిక
బాధ్యులు పాల్గొన్నారు.



