Friday, November 27, 2026
spot_img

ఎస్.ఐ.ఓ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాధ్యక్షుల ఈదుల్ అజ్వా సందేశం

ఈదుల్ అజ్ఞా త్యాగాలకు ప్రతీక, సర్వం దైవ ప్రసన్నత కొరకు ధారపోయాలనే తపన, అత్యంత ప్రీతి ప్రాయమైన ప్రతిదీ దైవ మార్గంలో వెచ్చించాలనే భావన ప్రతీ విశ్వాసి యెక్క హృదయవేదన: దీనికి దర్పణం ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలాం) జీవితం. ఉత్తమ సమాజ నిర్మాణానికి వీరి కృషి | అనిర్వచనీయం. ప్రతి హృదయంలోనూ అచంచల విశ్వాసం, సత్యస్థాపన కొరకు నిరంతర కృషి, స్థిరచిత్తం, త్యాగనిరతి వంటి సద్గుణాలు ఈ పండుగ ద్వారా ద్విగుణీకృతం కావాలి. ప్రతీ ఆరాధనలో కొత్తదనాన్ని నింపాలి. ప్రతీ త్యాగంలోనూ విశ్వాసాన్ని పటిష్ట పరచాలి.

రండి! మన యువభారత నిర్మాణానికి యువ శక్తి ఇంధనమవగా నైతికత, సత్యాల ప్రతిపాదకన మరో భారతాన్ని నిర్మిద్దాం! శాంతి స్థాపనకై ఇస్లామీయ ఉద్యమ యువ శూరులై యువ నైపుణ్యాలను ధారపోద్దాం!

ఉత్తమ సమాజనిర్మాణానికి మన కృషి మైలురాయిగా నిలవాలని ప్రతీ మంచి కార్యానికి అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ…. అందరికీ ఈదుల్ అజ్ఞా శుభాకాంక్షలు.

శాంతి స్థాపనోద్యమం-హజ్

– ఎస్.ఐ.ఓ తెలంగాణ రాష్ట్రాధ్యక్షులు అబ్దుల్ మలిక్ షారిఖ్

ప్రపంచం నలుమూలలోని ముస్లిములు హజ్ కాలం రాగానే హజ్ కోసం సిద్ధమై బయలు దేరుతారు. ఒక హాజీ, హజ్ సంకల్పం చేసుకోగానే, ఆ సంకల్పానికి తోడు అతనిలో దైవభీతి. దైవచింతన, పశ్చాత్తాపం, తన తప్పుల్ని మన్నింపచేసుకోవాలన్న కాంక్ష, నైతికత నెలకొంటాయి. జిల్రాజ్ మానంలో జరిగే హజ్ యొక్క ఈ విశ్వ జనీన సదస్సు ఆశయపూరితమైనది.

ఒకే లక్ష్య సాధనకు ఒకే కేంద్రానికి చేరడం: ప్రపంచంలోని సమస్త జాతుల నుండి వచ్చి చేరిన ప్రజలు ఒకే కేంద్రంలో ఒకే లక్ష్యం కోసం తమ నడుమ ఉండే వైరాన్ని తొలగించడానికి, కక్షలు కార్పణాలు, కల్లోలాలను రూపుమాపి, సౌభ్రాతృత్వాల వాతావరణాన్ని నెలకొల్పడానికి హజ్ లాంటి వేరే మార్గం లేదు.

శాంతి స్థాపనకు అతిపెద్ద ఉద్యమం: హజ్, ఉమ్రాల కోసం ప్రత్యేకించబడ్డ నాలుగు నెలల్లో కాబా వైపునకు వచ్చే మార్గాలన్నింటిలోనూ శాంతి స్థాపించాలని ఆదేశించబడింది. కాబా గృహం ప్రళయం వరకు శాంతి నిలయంగా విరాజిల్లుతుంది. దీని పరిధిలో మనిషినే కాదు జంతువునైనా వేటాడానికి వీల్లేదు. గడ్డిని సైతం కోసే అనుమతి లేని ఈ నగరంలో హజ్ శాంతి. స్థాపనకు అతిపెద్ద ఉద్యమం.
అసలైన సమానత్వానికి కేంద్రం: ప్రపంచంలోని ఏ మూలకు చెందిన ముస్లిమైనా సరే అందరికీ సమాన హక్కులు వర్తిస్తాయి. కాబా పరిసర ప్రాంతం మస్జిద్ లాంటిది. అక్కడ ఎవరైనా వెళ్ళి కూర్చుంటే అతణ్ణి అక్కడ్నుంచి లేపలేరు. అద్దె వసూలుచేయలేరు. | అయితే అతడు తన జీవితాంతం ఆ ప్రదేశంలో కూర్చుని, ఆ ప్రదేశం నాదనే హక్కు, దాన్ని అమ్మే హక్కు అతనికి లేదు.

ఇస్లాంలో తప్ప ఈ శుభాలు, వరాలు మరెక్కడా లభ్యంకావు. ఇస్లాం ద్వారా, హజ్ మరియు ఖుర్బానీ ద్వారా ఉంచిన శుభాలకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రపంచ శాంతి స్థాపనకు మనం చేసే కృషిని దైవం స్వీకరించాలని ప్రార్ధిస్తూ…. అందరికీ ఈదుల్ అజ్ఞా శుభాకాంక్షలు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles