అప్పుడెప్పుడు ఓ నక్క ద్రాక్ష తోటకు వెళ్ళిదంట అక్కడ వెలాడుతున్న ద్రాక్ష గుత్తులను చూసి తిందామనుకుందంటా. ఎంత ప్రయత్నించినా దొరక్కపోయేసరికి అది పుల్లగా ఉందని వెళ్ళిపోయిందంట. చాలా మంది అందని ద్రాక్ష పుల్లన అనే తెలుగు సామెత ప్రకారం పెద్దగా శ్రద్ధ వహించరు. దాంతో వచ్చే అవకాశాలన్నీ చేజార్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ముందునుండే అది మనకు అందదులే… ఉద్యోగం నాకు రాదులే… నేను పరీక్షలో క్వాలిఫై అవ్వనులే. అంటూ నిటూర్చుతూ ఉంటారు. సానుకూల ద్రుక్పదంతో ఆలోచించడం నేర్చుకోవాలి. ముందునుండే రాదులే కాదులే అనుకుంటే ఏదీ మనం చేయలేము. ఇలా అనుకుంటే గ్రహంబెల్ ఫోన్ కనుక్కునేవాడా… రైట్ బ్రదర్స్ విమానం కనుక్కునే వారా… అంతెందు కండి షజహాన్ ఇలానే అనుకుంటే తాజ్‌మహల్ కట్టేవాడా… కులికుతుబ్ షా చార్మినార్ కట్టేవాడా… నావల్ల కాదు… కాదు.. నా వల్ల ఎందుకు కాదు అనుకోవాలి. సాధించాలని మనసు కోరితే కాదేది నీకు అసాధ్యం.
ఓపిక పండు తియ్యనా…
ఇటు విద్యార్థులు, అటు నిరుద్యో గులు అందరూ ప్రస్తుతం ఈ జపమే చేస్తు న్నారు. ఎందుకంటే ఎంసెట్, ఎంబిబిఎస్ లాంటి పోటీ పరీక్షలు నిర్వహించిన అనం తరం ప్రతి కౌన్సిలింగ్‌కి ప్రభుత్వాలు నెలల సమయం తరువాత ప్రక్రియ ప్రారంభించారు. పాపం నిరుద్యోగ అభ్యర్థులయితే ఇంకా ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. నిజానికి ఇప్పుడున్న ఆశాకిరణం ఏమిటంటే ఓక వండుతియ్యనా… అదే నండి ఉర్దూలోని సామెత సబర్ కాఫల్ మీఠా… అవునండి ఓర్పు వహించిన అనంతరం పండు తియ్యగా ఉంటుంది. ఏడాది ఓపికగా ఎదురు చూసిన తరు వాత వేసవిలో వచ్చే మామిడికాయ ఎంత రుచికరంగా ఉంటు దో… చలికాలంలో వచ్చే సీతాఫలం గింజలుండి కొంత ఇబ్బంది పెట్టినా అబ్బో భలేఉంటుంది. చాలా కాలం కష్టపడిన తరువాత లేదా.. వేచి ఉన్న తరువాత కావాల నుకున్నది దొరికినప్పుడు నిజంగా సంతోషమేస్తుంది. నిజంగా ఓపికగా ఎదురుచూస్తున్న వారంతా తమ తమ భవిష్యత్తు కోసం మరింత కసరత్తు చేస్తూ ఉండాలి. తీరా కావాలనుకున్నది వచ్చి నప్పుడు దానిని మనం అందుకోలేక పోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఉదా: ఉద్యోగ ప్రకటనల కోసం కేవలం ఎదురు చూస్తూ కూర్చుంటే సరిపోదు. దాని కోసం సన్నద్ధం అవుతూ కూడా ఉండాలి. తీరా ప్రకటనలు వచ్చి అర్హత పరీక్షలలో అర్హత సాధించ కుంటే వేచి ఉన్న సమయం అంతా వృధా చేసినట్లవుతుంది కదా.
కొత్తగా ఏర్పడి రెండు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కొత్తకొత్త ఉద్యోగ ప్రకటనలు చేసేందుకు రెడీగా ఉన్నాయి. అవకాశాలు దూసుకువచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుండే శ్రద్ధ వహించి కొంత కసరత్తులు ప్రారంభిస్తే. అవకాశాలను అందుకోవచ్చు.



