నేను మంచం మీద నిస్సహాయ స్థితిలో పడి వున్నాను. నా కుటుంబ సభ్యులు, బంధువులు నా చుట్టూ నేల మీద కూర్చొ న్నారు. నా శ్రేయోభిలాషులు, ఆత్మీ యులు కొంచెం దూరంగా నిలబడి నా ముఖాన్నే తదేకంగా చూస్తున్నారు. నేను పెద్దగా శ్వాస తీసుకుంటున్నాను. ఊపిరి తీసుకోవడం కోసం నానా యాతనలు పడుతున్నాను. నాకు కొంత దూరంలో ఉన్న గదిలో జనాలు గుమికూడి ఖుర్ఆన్ గ్రంథాన్ని శ్రావ్యంగా పఠిస్తు న్నారు. నా శ్వాస ఇప్పుడు కాస్త మంద గించింది. నా కళ్ళు పూర్తిగా తెర్చు కున్నాయి. మరణ దూత కూడా అతిథిలా వచ్చేశాడు. నేను నా పరలోక ప్రయాణా నికి చేరువ అవుతున్నాను. నా నోరు కూడా పెద్దగా తెరుచుకుపోయింది నా నోటిలో నా సోదరుడు జమ్ జమ్ జలాన్ని పోస్తున్నాడు. నా చివరి ఘడి యలు ముగిసి పోవచ్చాయి.
అందరూ కలిమాయె షహాద పఠించ నారంభించారు. నేను నా దృష్టిని కోల్పో యాను. నా మాట కూడా పడిపోయింది. నా దేహమంతా క్రమక్రమంగా నిర్జీవ మైపోతుంది. కాని ఇంకా నా వినికిడి
శక్తిని కోల్పోలేదు. నా ఆత్మీయుల రోదనలు వినబడుతూనే ఉన్నాయి. నేను చనిపోలేదు కాని దాదాపు మరణించిన వాడిలా చలన రహితంగా వున్నాను. ఇంతలో మరణదూత తన అంతిమ కార్యాన్ని పూర్తిచేశాడు. ఒక్క కుదుపులో నా ఆత్మ నా దేహం నుండి వేరుచేయ బడింది. నేను ఇప్పుడు ఈ లోకం నుండి శాశ్వతంగా వేరైపోయాను.
నా సిరిసంపదలు, నా ఆస్తిపాస్తులు, నా సర్వస్వం అంతా ఇప్పుడు నా కెలాంటి ప్రయోజనాన్ని కలిగించడం లేదు. ఇన్నాళ్లు ‘ఇదినాది’ అనుకున్నదేది నాది కాకుండా పోయింది. ఇప్పుడు నా ఖనన ప్రదేశమే నా చిరునామ. నేను మనిషిలా కాదు మృత దేహంగా పిలువబడు తున్నాను. కొందరేమో నా సమాధి త్రవ్వ డానికి వెళ్ళారు. మరి కొందరేమో నా దేహాన్ని ఎక్కువ సేపు ఇంట్లోనే ఉ ౦చడం అశుభకరంగా భావిస్తున్నారు. నా చివరి స్నానం కోసం అంతా సిద్ధం చేశారు. స్నానాదులు ముగించి నూతన వరుడిలా ముస్తాబు చేస్తున్నారు.
నా దేహం తెల్లటి వస్త్రంతో చుట్టివేయడం జరిగింది. నా శవాన్ని నా ఖరీదైన కారులో కాకుండా ఒక పురాతన పల్లకిలో తీసు కెళ్తున్నారు. ఇక దేనికోసం ఇంత సంపా దించింది నాకు ఇపుడు ఎలాంటి ప్రయోజనం కలిగించలేని ఈ తుచ్ఛ ఐచ్చికల కోనమా నా జీవితాన్ని ధారపోసింది? అబద్ధాలెన్నో ఆడాను, అభాండాలెన్నో వేసాను, పరలోక జీవి తాన్ని మరిచి పాప పంకిలంలో కూరుకుపోయాను. ఇప్పుడు నా తప్పుంటో నేనూ తెలుసుకున్నాను. నాకు మళ్లీ జన్మించాలని ఉంది. పాప రహిత జీవితం గడపాలని ఉంది అని ఎంత మొరపెట్టుకున్నా వినే నాథుడే లేడే…! అని రోదిస్తూ నా శవం వెంటే నేను నడుస్తున్నాను.
ఇప్పుడు ఈ ఊహ నుండి బయటికి రండి. ప్రస్తుతానికి ఇది కేవలం ఊహ మాత్రమే కావొచ్చు. కాని ఏదో ఒక రోజు ఈ ఊహ మనందరి జీవితాల్లో నిజం అవుతుంది. కాబట్టి మరణానికి మునుపే మన పరలోక సామాగ్రిని సిద్ధపరచు కోవాలి. మన కర్మలే మన వెంట వస్తాయి. మన సత్కార్యాలే పరలోక సాఫల్య ప్రాప్తికి కారకమవుతాయి. అందు చేత మనం ఎల్లవేళలా మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మరణం అతి సమీపంలోనే ఉంది. అది ఎప్పుడైనా సంభవించవచ్చు. ఈ జీవితం ఒక కల లాంటిది. అది చెదిరిపోక మునుపే మేల్కోవాలి.
సర్వసృష్టితాల పాప పుణ్యాల విచారణ కర్త అయిన అల్లాహ్ తన పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా హెచ్చరిం చాడు.
మీరెక్కడ ఉన్నాసరే, మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నా సరే (అది మిమ్మల్ని వదలదు). (ఖుర్ఆన్ 4 : 78)



