ఒక ధనవంతుడు చనిపోతూ తన ఆస్తినంతా తనవాళ్లకి చెందేటట్లు వీలునామ రాశాడు. ఆయన చనిపోయాడు. ఆయన కొడు కులు ఆస్తులు పంచుకు న్నారు. ఆయన తన వీలునామలో బీరువాలో ఉన్న చిన్న పెట్టి గురించి రాశారు. ఆ పెట్టెలో అత్యంతవిలువైన వస్తువు ఉంది. దాన్నిమటుకు నేను ఎవరికి పడితే వారికి ఇవ్వను. దాని విలువ తెలిసిన వారికే దానికి సొంతం చేసుకునే అధికారం ఉంది.
ఎందుకంటే అవి ఆషామాషి వస్తువు కాదు. దాని విలువ తెలీని వాళ్ల చేతిలోకి వెళ్తే దానికి విలువ ఉండదు ఆ విలువైన వస్తువు వల్లె నేను నా జీవితంలో ఇంత ఎత్తుకు ఎదిగాను. నాకున్న ఆస్తిపాస్తులన్నీ ఒక ఎత్తు ఆ పెట్టెలోని విలువైన వస్తువు ఒక ఎత్తు నేను నా జీవితకాలంలో కొన్ని సందర్భా లలో నా ధనాన్ని సైతం వదలు కున్నాను. కానీ ఆ విలువైన వస్తువు మాత్రం వృథాగా పోనివ్వలేదు. నేను దానికి అంత గౌరవం విలువ ఇచ్చాను. కాబట్టి అదికూడా నాకు అంటే గౌర వాన్ని విలువని, ధనాన్ని, కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. అందుకే నేను పదేపదే అంటున్నాను. నా ఆస్తి ఎవరు ఎంత పంచుకున్నా పర్వాలేదు. ఆ వస్తువు మాత్రం దాని విలువ తెలిసిన వాళ్లే తీసుకోండి అని వీలునామలో రాశాడు అది చదివిన భార్య పిల్లలు ఆశ్చర్య పోయి తమకు కూడా తెలియని వస్తువు గురించి తెలుసుకుని ఆతృతతో బీరువా తెరిచి ఆ చిన్న పెట్టెను తెరిచారు. అందులో కాలాన్ని సూచించే విలువైన చేతి వాచిని చూసి వారు విస్మయం చెందారు.
అల్బర్ట్ ఐన్స్టీన్, ఎడిసన్, దీరు బాయి అంబాని లాంటి వారందరూ ఒకప్పుడు మనలాంటి సామాన్యులు మనకున్నా 24 గంటలు సమయమే వారికుండేది. కానీ, కనిపించే తేడా ఒక్కటే. ఆ 24 గంటలను సద్విని యోగం చేసుకున్న విధానం, వారిని ఉన్నత స్థానానికి చేర్చింది. కీర్తిని మిగిలించాలన్న అపకీర్తి కలిగించాలన్నా అది అతని సమయపాలన మీదే ఆధారవడి ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి టైంటేబుల్ వేసుకుని దాన్ని పాటించడం మంచిది. ఏ పని ఎంత సమయంలో ఖర్చవు తుంది. ఎంత వృథా అవుతుంది అని అంచనా వేసుకుంటూ ముందుకు సాగండి ప్రపంచంలో తిరిగిరానిది ఏదైనా ఉంటే అది సమయమే. అలాంటి సమయం మన నుంచి వృథాగా జారిపోతుంటే కళ్లప్పగిస్తూ చూస్తుండి పోయేవాడు మూర్ఖుడు.
ఎందుకు గొప్ప స్థాయికి ఎదగలేకపో తున్నామో విశ్లేషించుకోవాలి. అది అదృష్టమా? అవకాశామా? అంటే అది సరియైన జవాబు కాదు. ఆ గొప్పవారికి ఉన్న ఆశావాదం, ఓర్పు, సమయ పాలన, పట్టుదల మనలో లేవు అలాంటప్పుడు విజయం మన నీడను సైతం తాకలేదు. సమయాన్ని గుర్తిం చినవాడే నిజమైన మేధావి. సరిగ్గా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మన వృత్తి, నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి.
సమయాన్ని వృథా చేసేవారు తమకు తాము మలుచుకోలేరు. సమా జాన్ని చక్కబెట్టుకోలేరు. చైనాలాంటి దేశంలో మార్నింగ్ షోలు ఉండవంటే నమ్ముతారా? అక్కడి వారు సినిమాలు చూడడం చాలా తక్కువ. ఆ సమ యాన్ని వృత్తి నైపుణ్యం పెంపొందించు కోవడంలో ఉపయోగిస్తారు. అందుకే ప్రతీ ఎలక్ట్రానికి గాడ్జెట్ చైనా నుంచి చాలా తొందరగా ఇతర దేశాలకు ఎగు మతి చేస్తూ ఉత్పత్తిలో చైనా అగ్ర స్థానంలో ఉంది నిమిషం గడిస్తే తిరిగేది కాలమే కాదు. మన ఆయువు కూడా జీవితాన్ని ఉన్నత శిఖరాలకే చేర్చే దిశగా శ్రమించాలి. టైం ప్లానింగ్ తప్పనిసరి:
చేసే ప్రతి పనికి టైంటేబుల్ వేసుకుని దాన్ని పాటించడం మంచిది ఏ పని ఎంత సమయంలో ఖర్చవు తుంది. ఎంత వృథా అవుతుంది అని అంచనా వేసుకుంటూ ముందుకు సాగండి. ప్రపంచంలో తిరిగిరానిది ఏదైనా ఉంటే అది సమయమే అలాంటి సమయం మన నుంచి వృథాగా జారిపోతుంటే కళ్లప్పగిస్తూ చూస్తూండి పోయేవాడు మూర్ఖుడు చరిత్రకెక్కిన మహాపురుషుల ఇంట ర్వ్యూలు, చరిత్రలు గమనిస్తే సమయా నికి వారిచ్చిన విలువ, సమయం వారికిచ్చిన విలువ అవగతమవుతాయి ఎవడు పుట్టుకతో మేధావి కాదు పాండిత్యం, వారసత్వం కాదు. అది మనం నిర్ణయించుకునేది. విద్యార్థులు యవకులు తమ తమ కాలాన్ని కాలానికి వదిలేయకుండా తమను తామే తీర్చిదిద్దుకునేందుకు కృషి చేయాలి.



