Friday, November 27, 2026
spot_img

ఇస్లాంలో సామాజిక సేవా భావం

దైవ ప్రవక్త ముహమ్మద్ (స॥) మొదటి దైవవాణి అవతరించగానే ఆయన హిరా గుహ నుండి ఇంటికి మరలి వెళ్ళారు. ఆయన భయంతో వణికి పోతున్నారు. ఆ సమయంలో విశ్వాసుల మాతృమూర్తి ముహమ్మద్ (స॥) అయిన హజ్రత్ ఖదీజా (రజి.అహా) గారు ఆయనకు ధైర్యం చెప్పుతూ పలికిన మాటలు మహాప్రవక్త ముహమ్మద్ (స॥) గారి దైవ దౌత్యానికి పూర్వం గడిపిన జీవితానికి అద్దం పట్టేలా ఉన్నాయి. ఆ పలుకుల సారాంశం మీరు బంధువుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉంటారు కష్టాలలో చిక్కుకున్న వారికి సహాయపడతారు. అతిధిని సత్కరిస్తారు. భూమ్యాకాశాల ద్వారా వచ్చే ప్రమాదాల నుండి ప్రజలను కాపాడటానికి ప్రయత్నిస్తారు. దైవ సాక్షి అల్లాహ్ ఎప్పటికీ మిమ్మల్ని అగౌరవం పాలు చేయడు.

 

దైవ దౌత్యానికి పూర్వం ఆయన (స॥) గడిపిన జీవితం ఎంత విశిష్టమైనదంటే అందులో దైవ ప్రవక్త ముహమ్మద్ (స॥)కు హితోపదేశం (మంచిమాటలను చెప్పే) చేసే ధర్మస్థాపన అనే పెద్ద బాధ్యతను మోయటానికి శిక్షణ ఇచ్చేలా ఉండేది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ధర్మ సంస్థాపనే ధ్యేయం. దైవదౌత్య పదవి అందిన తరువాత ముహమ్మద్ (స)గారు సమాజ సేవకై పాటుపడ్డారు. దేనికయితే ఆయన పాటుపడ్డారో (సిద్ధపడ్డారో) అది ముస్లిం సముదాయానికి ఎంతో అవసరమైనది. మంచి ఆదర్శవంతమైనది. దీనిలోని ఒక అంశాన్ని మనం నెమరువేసుకుందాం.

 

ముస్సబ్బిల్ అమీర్ యొక్క సోదరులు ఈ విధంగా చెప్పారు. “నేను బద్ర్ యుద్ధ ఖైదీలలో ఒకడిని దైవ ప్రవక్త ముహమ్మద్ (స॥)గారు తన అనుచర సముదాయంతో ఈ విధంగా ఆదేశించారు. యుద్ధ ఖైదీలతో సత్ప్రవర్తన కలిగి ఉండండి. నేను అన్సారీల సమూహంలోని ఒక దళంలో ఉండేవాడిని వారి పరిస్థితి ఎలా ఉండేదంటే వారు మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంగా ఖర్జూర పండ్లు తినేవారు. మరి నాకు భోజనంగా (ఖర్జురంతోపాటు) రొట్టె కూడా తినిపించేవారు. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ (స॥) గారు వారిని ఆదేశించారు కాబట్టి

 

సామాజిక సేవకై పూనుకున్న ఇస్లామీయ సమాజానికి ఇటువంటి లక్షణాలు ఎంతో అవసరం. ఎటువంటి. క్లిష్ట పరిస్థితులలోనైనా సరే, మనస్సు దిగ్ర్భాంతికి లోనైనా సరే మన హృదయాంతరాల్లో ఖదీజా (రజి) చెప్పిన మాటలు మెదలాలి. కష్టాలలో చిక్కుకున్న వారికి సహాయపడతారు. అతిధిని సత్కరిస్తారు భూమ్యాకాశాల ద్వారా వచ్చే ప్రమాదాల నుండి). ప్రజలను కాపాడటానికి ప్రయత్నిస్తారు. దైవ సాక్షి అల్లాహ్ ఎప్పటికీ మిమ్మల్ని అగౌరవం పాలు చేయడు.

 

సామాజిక సేవ ఇస్లాం యొక్క ముఖ్య భాగమే కాక ధర్మసంస్థాపనలో కూడా ఎంతో అవసరమైనది. మనం గమనిస్తే సందేశం, ఏక దైవారాధన, పునరుత్థాన దినంతో పాటు సామాజిక సేవ గురించి చాలా సార్లు ఆదేశించబడింది. దివంగత ఖుర్రంమురాద్ (ర) ఇలా చెప్పేవారు. మనం గమనిస్తే ధర్మసంస్థాపన యొక్క ముఖ్య లక్ష్యం మానవ సేవ మరియు వారి మధ్య సత్సంబంధాలను ఏర్పరచటం మాత్రమే ధర్మసంస్థాపన, సామాజిక సేవను ఎందుకు కోరుకుంటుందంటే ఈ ప్రపంచంలో మనిషి నీతి, నిజాయితీ మరియు న్యాయశీలతతో జీవనం సాగించాలి. వారి జీవితాలు శాంతి, కరుణతో నిండిపోవాలి. వారు ఇహలోకంలో సుఖవంతమైన జీవనం సాగించాలి. మరియు పరలోకంలో దైవశిక్ష నుండి రక్షింపబడాలి.

 

ఖుర్రం మురాద్ (ర) మరొకచోట ఇలా చెప్పారు: అసలు ధర్మసంస్థాపన, జిహాద్ మరియు సందేశంలో ఇదే లక్ష్యం మరియు సిద్ధాంతంగా ఉంది. మానవునితో సానుభూతితోపాటు ప్రేమతో అతని మార్గవిహీనతపై ఆందోళన చెందేలా చేయడం మరియు అతని వ్యక్తిత్వ జీవితం కోసం అల్లాహ్ ప్రసన్నత మరియు అతని స్వర్గం పొందటమే లక్ష్యంగా చేయడం.

 

డాక్టర్ నజాతుల్లా సిద్దీఖ్ గారు ఇలా చెప్పారు: ధర్మస్థాపనకై పూనుకున్న ఇస్లామీయ సమాజం చేసే పనులలో లక్ష్యంగా 4విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ నాలుగు విషయాలను ప్రతి ఇంట్లో, ప్రతి ఊరిలో, ప్రతి పట్టణాలలో, ప్రతి చోటా అమలు చేసే విధంగా కృషి చేయాలి. 1) ముస్లిం స్త్రీ, పురుషులను విద్యావంతులను చేసే ఉద్యమం 2) ఆరోగ్య సంరక్షణ – పరిసరాల పరిశుభ్రత 3) విద్యావృత్తులను అభివృద్ధిని పరిచే ఉద్యమాలను చేపట్టాలి 4) ఉపాధిని అభివృద్ధి పరచటం కోసం సంపద వనరులను ఏర్పాటు చేయాలి.

 

దైవ సందేశం (ధర్మసందేశం) మరియు సామాజిక సేవకు చాల దగ్గర సంబంధం ఉంది. ధర్మసందేశ ప్రచారకులు ఒక వ్యవస్థ (మిషన్) అయితే సామాజిక సేవ దాని గుర్తింపు. సేవాగుణం లేని వారి సందేశంలో ప్రభావం ఉండదు. ఒక ముసలమ్మ సామాను తలమీద పెట్టుకొని ఆవిడ ఇంటి వరకు తీసుకుపోయే సేవా గుణం ధైర్యం అతనిలో లేకపోతే అతను ధర్మప్రచారం చేసే మంచి మాటలు (హితోపదేశం) చెప్పే బాధ్యతను మోయగలడా..?

 

ఎదుటి వారికి మనం అతని సానుభూతి పరులం అని నమ్మకం కలిగితే మనం చెప్పే ధార్మిక విషయాలను వినడమే కాదు. ఆ విషయాలపై చర్చించే అవకాశం కూడా ఇస్తాడు కదా..! ప్రొఫెసర్ సిద్దీఖ్ హుస్సేన్ (జమాఅతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షులు)

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles