Friday, November 27, 2026
spot_img

రమజాన్ సందేశం

ప్రస్తుతం మనం వెలకట్టలేని శుభదినాలలో గడుపుతున్నాం. రమజాన్ అన్ని మాసాలలాగానే ఒక మాసం. కాని ఇది అల్లాహ్ వద్ద ప్రాముఖ్యం గల మాసం. దీనికి ప్రాముఖ్యం రావడానికి కారణం మానవాళికి సన్మార్గం చూపే గ్రంథం అవతరించడమే. అల్లాహ్ అంటున్నాడు: షహరు రమజానల్లజి ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్ (2:185)

 

మొత్తం మాసంలో లైలతుల్ ఖద్రీకు ఎనలేని శుభాల రాత్రిగా నిర్దేశించాడు అల్లాహ్. ఎందుకంటే

వెయ్యి నెలలలో సాధ్యం కానటువంటి ఉపకారం ఈ ఒక్క రాత్రిలోనే మానవాళికి లభించడం వల్ల ఇన్నా అన్జల్ నా హుఫీలైలతిల్ ఖద్ర్ (అల్ఖద్ర్) ) ఈ నెలలో ఒక విశ్వాసవంతుడైన మోమిన్ ఉపవాసాలు పాటిస్తూ,దైవగ్రంథాన్ని తరావీలో పఠిస్తూ, వింటూ ఆ మహోన్నత మైన వరానికి ఉపకారిగా విధేయత పాటిస్తున్నాడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లం- దీని ఔన్నత్యాన్ని గురించి చేసిన పరిచయాన్ని బట్టి డిస్కౌంట్ సీజన్ అనిపిస్తోంది. ఈ మాసంలో పుణ్యాలు మరీ చౌకగా అయ్యాయి. మహనీయ సల్లం అన్నారు ఒక్క పుణ్యం విధిగా చేసే పుణ్యంతో సమానమని. విధిగా చేసిన ఒక పుణ్యం 70 విధులతో సమానం ఒక్క రోజాకు బదులు పది నుండి ఏడువందల పుణ్యాలవరకు లభిస్తాయి. కాని రోజా నా కోసం కాబట్టి నేనే స్వయంగా దాని ప్రతిఫలాన్నిస్తాను అంటాడు అల్లాహ్. ఒక ఉపవాసం పాటించే వ్యక్తికి ఎంత గౌరవం ఉందో దీనివల్ల తెలుస్తోంది రోజా ఉండే వారికోసం అల్లాహ్ ఒక స్వర్గ ద్వారాన్ని ప్రత్యేకించాడు దానిపేరే ‘అర్రయ్యాన్.’ అల్లాహ్ ఈ మాసంలో కలిగించదలచిన భావం ఏమిటంటే అవమాన భారంతో కృంగిపోయి నప్పటికీ అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెంద రాదు. తౌబ ద్వారాలు అల్లాహ్ వద్ద ఎప్పటికీ తెరిచే ఉంటాయి. ఈ నెలలో ప్రత్యేకించి ఒక దాసుడు  క్షమింపబడడానికి ప్రయత్నించాలి. మహనీయ సల్లం అన్నారు : ఎవరు విశ్వాసంతో తన్నుతాను పర్యవేక్షించుకుంటూ ఈ మాసంలో రోజా ఉంటాడో అతని గత పాపాలన్నీ క్షమించి వేస్తాడు. అందుకే మొదటి పది రోజులు కారుణ్యమని, రెండవ పదిరోజులు క్షమాపణ అని మూడవ పది రోజులు నరకం నుండి విమోచన కలిగించేవని చెప్పబడ్డాయి.

 

మిత్రులారా! ఎంతోమంది యువకులు రమజాను మాసం వచ్చేది రుచికరమైన ఆహార పదార్థాలు తినడానికి, రాత్రుల్లో షికార్లు చేయడానికే అని భావిస్తారు. కాని దివ్యఖుర్ఆన్ రోజా ఉద్దేశ్యాన్ని ‘తఖ్వా’ పొందడానికి అని పేర్కొంది. దైవభీతి కల్గిన హృదయ స్థితిని తఖ్వా అంటారు. రమజాను వచ్చిందంటే బాహ్యపరంగా ఎంతో మార్పు కనిపిస్తుంది. టోపి, దుస్తులు, సంభాషణలో, నడకలో మార్పుతో పాటు దివ్యఖుర్ఆన్ పారాయణం జిక్ర్ మొదలైన వాటిని చూస్తుంటే ఈ మార్పులు చాలా కాలం ప్రభావం వేస్తాయనిపిస్తోంది. అయితే కేవలం బాహ్యాన్ని సవరించుకుంటూ అంతరంగాన్ని గురించి పట్టించుకోకపోవడం వల్ల మాసాంతం వరకు దైవ అవిధేయతకు దూరంగా ఉంటారు. కాని పండుగ సంతోషాలు వారిని సినిమా ధియేటర్లకు పోకుండా ఆపలేవు.

 

అసలు రోజా వల్ల కలిగే మార్పులు సుదీర్ఘ కాలం వరకు జీవితంలో కొనసాగాలి. ఇదే రోజా ఉద్దేశ్యం. ఈ ఉద్దేశ్యం నెరవేరాలంటే ఒక వ్యక్తి పూర్తి స్పృహ, చైతన్యం కలిగి రోజా ఉంటేనే సాధ్యం.

 

దివ్యఖుర్ఆన్ అవతరించిన మాసం రమజాన్ కనుక ప్రతి యువకుడు వ్యక్తిగతంగా ఖుర్ఆన్ తో సంబంధం కలిగి ఉండడానికి ప్రయ త్నించాలి. దివ్యఖుర్ఆన్లోని ఒక్కొక్క ఆయత్ పఠించి అందులో తన కోసం ఏ సందేశం దో గ్రహించాలి.

 

చివరిగా… దైవప్రవక్త సల్లం ఈ మాసాన్ని సానుభూతి కలిగి ఉంటూ సమాజంలోని అవసరార్ధుల అవసరం తీర్చే మాసమని సెలవిచ్చారు. ఎవరు ఏ మేరకు స్థితిమంతులో స్థాయిలో అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయ ఆ డానికి ప్రయత్నించాలి. శరీరాన్ని నరకాగ్ని నుండి రక్షించే సాధనమే ‘సదఖా.’

మిత్రులారా! ఈ మాసంలో గడిచిపోయే ప్రతిదినాన్ని ఈ శుభాల అతిథి మాసాన్ని ఎంతగా గౌరవించాలో అంతగా గౌరవించ లేకపోయాం అనే భావన మనలో కలుగుతోంది. అయినప్పటికీ అల్లాహ్ మనల్ని దాని శుభాలకు దూరం చేయడని ఆశిద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles